అర‌వింద స‌మేత‌ ఇంకా ఎంత తేవాలి..?

అర‌వింద స‌మేత స్లో అయిందా.. క‌లెక్ష‌న్ల వేట‌లో వీర‌రాఘ‌వ జోరు త‌గ్గించాడా..? ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. రావాల్సిన వ‌సూళ్లు ఇంకా చాలా ఉన్నాయి.. అప్పుడే ఈయ‌న జోరు త‌గ్గిన‌ట్లుగా అనిపిస్తుంది. ఐదు రోజుల వ‌ర‌కు కుమ్మేసిన ఈ చిత్రం ఆరోరోజు చాలా వ‌ర‌కు స్లో అయింది. త‌క్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు 80 కోట్ల షేర్ తీసుకొచ్చింది అర‌వింద స‌మేత‌. సేఫ్ అవ్వాలంటే మ‌రో 14 కోట్లు కావాలి. ఇది పెద్ద క‌ష్ట‌మేం కాక‌పోవ‌చ్చు. ఇప్పుడు వ‌చ్చిన వ‌సూళ్లు.. దూకుడు చూస్తుంటే క‌చ్చితంగా అది కూడా వ‌సూలు చేసేలాగే క‌నిపిస్తుంది. అయితే 100 కోట్ల మార్క్ అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Aravinda-sametha-veera-raghava
ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో బాహుబ‌లి కాకుండా 100 కోట్ల షేర్ అందుకుంది ఖైదీ నెం 150.. రంగ‌స్థ‌లం మాత్ర‌మే. ఇప్పుడు మూడో సినిమాగా అర‌వింద స‌మేత అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ వారం హ‌లో గురు ప్రేమ‌కోస‌మేతో పాటు పందెంకోడి 2 కూడా వ‌స్తుంది. క‌చ్చితంగా ఈ రెండు సినిమాల వ‌ల్ల అర‌వింద స‌మేత‌ క‌లెక్ష‌న్లపై ప్ర‌భావం ప‌డుతుంది. ఒక‌వేళ రెండింటికి కానీ పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే వీర‌రాఘ‌వ కాస్తైనా జోరు త‌గ్గించాల్సిందే. మ‌రోవైపు ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం లాస్ వెంచ‌ర్ గానే మిగిలిపోయేలా ఉంది. ఈ చిత్రం అక్క‌డ 12 కోట్ల‌కు అమ్మారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చినవి 8 కోట్లు మాత్ర‌మే. ఇంకా రావాలి.. ఇప్పుడు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు వీర‌రాఘ‌వ పోరాటం ఎలా సాగ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here