అర‌వింద స‌మేత‌ను మొత్తానికి 100 కోట్లకు చేర్చారుగా..

తెలుగులో మూడో 100 కోట్ల సినిమా వ‌చ్చేసింది. బాహుబ‌లి కాకుండా 100 కోట్ల షేర్ వ‌సూలు చేసిన సినిమాలు రెండు మాత్ర‌మే ఉన్నాయి. ఖైదీ నెం.150 అండ్ రంగ‌స్థ‌లం. ఇప్పుడు మెగా హీరోల‌కు తోడుగా నంద‌మూరి హీరో కూడా వ‌చ్చాడు. మూడు వారాల త‌ర్వాత అర‌వింద స‌మేత కూడా 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది.

Aravinda Sametha Veera Raghava

ఇప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ అయితే ఆప‌డం లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. డైలాగులు.. పాట‌లు విడుద‌ల చేస్తూనే ఉన్నారు. రెడ్డమ్మ త‌ల్లి.. క‌ర్నూల్ డైలాగ్.. 5 రూపాయ‌ల ఫ్యాక్ష‌న్.. ఇలా రోజుకో ప్ర‌మోష‌నల్ వీడియోతో ఈ వారం ఒక్క‌టి గ‌ట్టెక్కించాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఐదు రోజుల వ‌ర‌కు కుమ్మేసిన ఈ చిత్రం ఆరో రోజు చాలా వ‌ర‌కు స్లో అయింది. త‌క్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు 100 కోట్ల షేర్ తీసుకొచ్చింది అర‌వింద స‌మేత‌. ఒక్క ఓవ‌ర్సీస్ మిన‌హా అన్నిచోట్లా ఈ చిత్రం సేఫ్ జోన్ కు వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల న‌ష్టాలు ఉన్నాయి కానీ అవి మ‌రీ అంత ఎక్కువ అయితే కాదు. ఈ వారంతో సినిమా ర‌న్ అయిపోతుంద‌ని వాళ్ల‌కు కూడా తెలుసు అందుకే ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచారు. ఈ వారం స‌వ్య‌సాచి వ‌స్తుంది. దానిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి నాగ‌చైత‌న్య సినిమా వ‌చ్చే వ‌ర‌కు వీర‌రాఘ‌వుడే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర కాపాలాగా ఉండేది. మ‌రి ఈయ‌న పోరాటం ఎక్క‌డ ముగుస్తుంద‌నేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here