అర‌వింద స‌మేత బాక్సాఫీస్ ఉగ్ర‌రూపం..

ఎన్టీఆర్ మ‌రోసారి రెచ్చిపోయాడు. ఆయ‌న దూకుడు చూసి బాక్సాఫీస్ ద‌ద్ద‌రిల్లిపోయింది. ఆక‌లితో ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అలా కొట్టాడు దెబ్బ‌. ముందు నుంచి అనుకుంటున్న‌ట్లే యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా అర‌వింద స‌మేత ఊచ‌కోత ఆగ‌డం లేదు. తొలిరోజు ఈ చిత్రం రికార్డుల సునామీ సృష్టించింది. ఇంటా బ‌య‌టా అనే తేడా లేకుండా కుమ్మేస్తుంది అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌.

ARAVINDA SAMETHA  collections

ఆయ‌న దెబ్బ‌కు అజ్ఙాత‌వాసి తొలిరోజు రికార్డులు కూడా క‌దిలిపోయేలా క‌నిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే 27 కోట్ల షేర్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా తొలిరోజే 1 మిలియ‌న్ దాటేసింది ఈ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ కెరీర్ లో క‌నివినీ ఎరుగ‌ని రికార్డుల‌కు తెర తీస్తున్నాడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వుడు. నైజాంలో 5.73 కోట్ల షేర్.. క‌ర్ణాట‌క‌లో కూడా 3 కోట్ల వ‌ర‌కు షేర్.. త‌మిళ నాట కోటి.. కృష్ణా జిల్లా 2 కోట్ల‌కు పైగా షేర్.. ఇలా ప్ర‌తీచోటా రికార్డులకు తెర‌తీస్తున్నాడు ఎన్టీఆర్. రెండో రోజు కూడా ఇదే దూకుడు సాగుతుంది.

ద‌స‌రా హాలీడేస్ ఉండ‌టంతో క‌చ్చితంగా ఈ వారం రోజుల్లోనే సినిమా 100 కోట్ల షేర్ సాధించే దిశ‌గా అడుగేస్తుంది. మాస్ సెంట‌ర్స్ లో అర‌వింద స‌మేత ఉగ్ర‌రూపం చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లు ఈ రేంజ్ లో సినిమా కుమ్మేస్తుంద‌ని ఊహించ‌లేదు ఎవ‌రూ. మొత్తానికి అర‌విందుడి దూకుడు చూస్తుంటే ఎన్టీఆర్ ఖాతాలో వ‌ర‌స‌గా ఐదో విజ‌యం చేరిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here