అర‌వింద స‌మేత త‌గ్గ‌ట్లేద‌స‌లు..!

ఎన్టీఆర్ రెచ్చిపోతే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్పుడు అర‌వింద స‌మేత‌ను చూస్తుంటే అర్థ‌మైపోతుంది. అబౌ యావ‌రేజ్ టాక్ తోనే రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాడు ఈ హీరో. రెండో రోజు కూడా ఈ చిత్రం రికార్డ్ వ‌సూళ్ల‌ను సాధించింది. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో కుమ్మేస్తున్నాడు వీర రాఘ‌వుడు. తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 36 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు 11 కోట్ల షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 8 కోట్ల‌కు పైగా షేర్ ఉంది. అంటే రెండు రోజుల్లోనే 47 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.

Aravinda Sametha 2 Days Box office Collections

మ‌రో 45 కోట్లు వ‌సూలు చేస్తే సినిమా సేఫ్ జోన్ కు వ‌చ్చేస్తుంది. ఇదే దూకుడు కొన‌సాగితే సేఫ్ జోన్ కు రావ‌డం పెద్ద విష‌య‌మేం కాదు. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా తొలిరోజే 1 మిలియ‌న్ దాటేసింది ఈ చిత్రం. రెండోరోజు కూడా అక్క‌డ 2 ల‌క్ష‌ల 50 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ కెరీర్ లో క‌నివినీ ఎరుగ‌ని రికార్డుల‌కు తెర తీస్తున్నాడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వుడు. నైజాంలో రెండో రోజు 2.83 కోట్ల షేర్.. క‌ర్ణాట‌క‌లో కూడా 1.20 కోట్ల వ‌ర‌కు షేర్.. త‌మిళ నాట 50 ల‌క్ష‌లు.. కృష్ణా జిల్లా 58 ల‌క్ష‌ల‌కు పైగా షేర్.. ఇలా ప్ర‌తీచోటా రికార్డులకు తెర‌తీస్తున్నాడు ఎన్టీఆర్. మూడో రోజు కూడా ఇదే దూకుడు సాగుతుంది. ద‌స‌రా హాలీడేస్ ఉండ‌టంతో క‌చ్చితంగా ఈ వారం రోజుల్లోనే సినిమా 100 కోట్ల షేర్ సాధించే దిశ‌గా అడుగేస్తుంది. మాస్ సెంట‌ర్స్ లో అర‌వింద స‌మేత ఉగ్ర‌రూపం చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లు ఈ రేంజ్ లో సినిమా కుమ్మేస్తుంద‌ని ఊహించ‌లేదు ఎవ‌రూ. మొత్తానికి అర‌విందుడి దూకుడు చూస్తుంటే ఎన్టీఆర్ ఖాతాలో వ‌ర‌స‌గా ఐదో విజ‌యం చేరిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here