రామ్ చరణ్ పాత్రలో నటించబోతున్న అనుష్క..

రామ్ చరణ్ నటించిన పాత్రలో అనుష్క నటించబోతుంది.. అదేంటి అదెలా సాధ్యం.. హీరో చేసిన పాత్రలో హీరోయిన్ ఎలా నటిస్తుంది.. ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కదా. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే అనుష్క.. రామ్ చరణ్ పాత్రలో నటించబోతోంది. తన తర్వాత సినిమా కోసం రంగస్థలంలో చిట్టిబాబు పోషించిన పాత్ర ఇప్పుడు జేజమ్మ కూడా పోషించబోతోంది. అసలు విషయం ఏంటంటే అనుష్క త్వరలోనే కోన వెంకట్ తో ఒక సినిమా చేయబోతుంది. ఈ చిత్రం టైటిల్ సైలెన్స్. ఇందులో అనుష్క పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.

ramcharan anushka

సైలెన్స్ సినిమాలో అనుష్కకు చెవులు వినిపించవు. అలాగే మాటలు కూడా అంతంతమాత్రంగానే వస్తాయని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తాను సిద్ధం చేసుకుంటుంది జేజమ్మ. మాధవన్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. 12 ఏళ్ల కింద ఈ హీరోతో రెండు అనే సినిమా చేసింది అనుష్క. ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు చాలాకాలం వరకు చూడలేదు జేజమ్మ. ఇన్నేళ్లకు మళ్లీ మాధవన్ తో కలిసి నటించబోతోంది అనుష్క. ఈమధ్య సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇప్పుడు మరోసారి అనుష్కతో కలిసి నటించబోతున్నాడు ఈ హీరో. మొత్తానికి మరి అనుష్క ఈ చెవుడు పాత్రలో ఎలా నటించబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here