అనుష్క ఆ సీక్రేట్ చెప్ప‌బోతుందా..?

అనుష్క‌కు సినిమాలంటే ఇష్టం లేదా.. ఆస‌క్తి లేదా..? లేదంటే కెరీర్ ఇక చాల‌నుకుంటుందా..? ఇవ‌న్నీ ఇప్పుడు ఈమె అభిమానులు వేస్తోన్న ప్ర‌శ్న‌లే..! అనుష్క విష‌యంలో అస‌లేం జ‌రుగుతుందో తెలియ‌ట్లేదు. సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో.. ఎందుకు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేదో అన్నీ చెప్పేసింది ఈ భామ‌.

Anushka Shetty Next Movie Name Lock

భాగ‌మ‌తి త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా కూడా సైన్ చేయ‌లేదు అనుష్క‌. తాను సినిమాల‌కు దూరం కానున్న మాట అవాస్త‌వం అని.. అయితే బ్రేక్ మాత్రం తీసుకుంటున్నాని చెప్పింది ఈ భామ‌. ఆ మ‌ధ్య గౌత‌మ్ మీన‌న్ సినిమా ఒప్పుకున్నా అది ఎప్ప‌టికి ప‌ట్టాలెక్కేనో ఆయ‌న‌కే తెలియ‌దు. పైగా బ‌రువు విష‌యంలోనూ ఇప్ప‌టికీ అనుష్క అలాగే ఉంది. వ‌య‌సు కూడా 37 ఏళ్లు రావ‌డంతో కుర్ర హీరోల‌కు స‌రిపోయే ఫిజిక్ కాదు.

స్టార్ హీరోలు కూడా అనుష్క‌తో రొమాన్స్ అంటే ఇప్పుడు ఎందుకులే అంటున్నారు. ఇప్ప‌టికీ అనుష్క నార్మ‌ల్ అవతారంలోకి మార‌లేదు. ఆంటీలా మారిపోయింది. ఈ రూపంతోనే బాహుబ‌లి 2, ఓం న‌మో వెంక‌టేశాయా, సింగం 3 షూటింగ్ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అనుష్క బ‌రువు త‌గ్గించ‌డానికే బాహుబ‌లి 2 లో స్పెష‌ల్ గ్రాఫిక్స్ ను కూడా వాడుకున్నారు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ అనుష్క సినిమాలు చేస్తుంది.

కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి క‌థ అందిస్తుంటే.. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో రానుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్ర టైటిల్ సీక్రేట్ అని పెట్టాల‌ని ప‌రిశీలిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంద‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి. ప్ర‌స్తుతం 11 కిలోల బ‌రువు త‌గ్గాల‌ని చూస్తుంది అనుష్క‌. మొత్తానికి త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here