అనుష్క‌తో అనుష్క‌.. అదిరిన మైన‌పు బొమ్మ‌..

సెలెబ్రెటీల‌కు మైన‌పు బొమ్మ‌లు పెట్ట‌డం కామ‌న్ అయిపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా వాళ్ల విగ్ర‌హాలే క‌నిపిస్తున్నాయి. అందులోనూ మేడ‌మ్ తుస్సాడ్స్ లో విగ్ర‌హం అంటే కాస్త అద్బుత‌మే. ఇప్పుడు అనుష్క శ‌ర్మ‌కు కూడా అక్క‌డ విగ్ర‌హం వ‌చ్చేసింది. త‌న మైన‌పు బొమ్మ‌ను చూసుకుని హాయిగా న‌వ్వుకుని.. మురిసిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సెల్ఫీ తీసుకుంటున్న‌ట్లు చెక్కిన ఆ శిల్పాన్ని చూసి అబ్బా అంటూ పోజ్ ఇచ్చింది.

Anushka sharma unveils her wax statue at madame tussauds

త‌న‌కు బాగా న‌చ్చిన విగ్ర‌హం అంటూ ఫ్యాన్స్ తో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ఈ భామ‌. సెల్ఫీ తీసుకుంటున్న‌ట్లుగా ఉండే విగ్ర‌హం ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేదు. తొలిసారి ఓ హీరోయిన్ కోసం అలాంటి మైన‌పు బొమ్మ‌ను సిద్ధం చేసారు. అదే సింగ‌పూర్ మేడ‌మ్ తుస్సాడ్స్ లో ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల విగ్ర‌హాలు ఉన్నాయి కానీ చూడ్డానికి అనుష్క మాత్రం చాలా క్యూట్ గా క‌నిపిస్తుంది.. ఆక‌ర్షిస్తుంది. ఎందుకంటే సెల్ఫీ పోజిస్తూ ఉండ‌టంతో అంద‌రూ ముందుగా ఆ భామ ద‌గ్గ‌రికే వెళ్తున్నారు. అస‌లు అది మ‌నిషా బొమ్మా అని క‌నుక్కోడానికి కూడా కాస్త టైమ్ ప‌ట్టేలా ఉంది అంటే ఎంతందంగా చెక్కారో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి త‌న మైన‌పు బొమ్మ చూసి త‌నే షాక్ లోకి వెళ్లిపోయింది అనుష్క శ‌ర్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here