అను ఎమ్మాన్యువ‌ల్ గీత‌గోవిందం ఎందుకు వ‌దిలేసింది..?

అను ఎమ్మాన్యువ‌ల్ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రెండేళ్లు దాటిపోయింది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేదు. మ‌జ్నుతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన ఈ మ‌ళ‌యాలి ముద్దుగుమ్మ ఇండ‌స్ట్రీలో అస్తిత్వం కోసం పోరాడుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిలో న‌టించినా అమ్మాయిగారికి పెద్ద‌గా హెల్ప్ కాలేదు.

Anu Emmanuel Feeling sad for rejecting geetha govindam Movie

గోపీచంద్ ఆక్సీజ‌న్ కూడా డిజాస్ట‌రే. ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య సైతం డిజాస్ట‌ర్. మొన్న విడుద‌లైన‌ నాగ‌చైత‌న్య శైల‌జా రెడ్డి అల్లుడు కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇక ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేజేతులా వ‌దిలేసుకుంది. దాంతో పాటు మ‌రో సినిమా కూడా ఈ భామ వ‌దిలేసుకుంద‌ని ఇప్పుడే తెలిసింది. అదే గీత‌గోవిందం.. 2018 బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ చిత్రంలో ముందు హీరోయిన్ గా అను ఎమ్మాన్యువ‌ల్ ను అనుకున్నారు.

అయితే ఆ స‌మ‌యంలో నా పేరు సూర్య ఉండ‌టంతో దానికి డేట్స్ క్లాష్ అవుతాయ‌నే ఉద్దేశ్యంతో అను ఈ చిత్రాన్ని వ‌దిలేసింది. కానీ ఇప్పుడు ఆ సినిమాను వ‌దిలేసి నా పేరు సూర్య చేసినందుకు క‌చ్చితంగా ఫీల్ అవుతూ ఉంటుంది. బ‌య‌టికి మాత్రం త‌న‌కు రెండు స‌మాన‌మే అని చెబుతుంది కానీ గీత‌గోవిందం చేసుంటే అను కెరీర్ మ‌రోలా ఉండేదనేది మాత్రం వాస్త‌వం. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూ మ‌రోవైపు ఫోటోషూట్ల‌లో రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి. తాజాగా అమ్మాయి గారు ఓ ఫోటోషూట్ లో చూపుల‌తోనే చంపేస్తున్నారు. ట్రెడీషిన‌ల్ లుక్ తో పాటు త‌న‌లో ఈ మోడ్ర‌న్ యాంగిల్ కూడా ఉంద‌ని ద‌ర్శ‌కుల‌కు హింటిస్తుంది అను ఎమ్మాన్యువ‌ల్. మొత్తానికి చూడాలిక ఇప్పుడు అను కెరీర్ కు ఊపిరి ఊదే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here