అను ఎమ్మాన్యువ‌ల్ ను మెగా కంపౌండ్ పిలుస్తుందిగా..

అను ఎమ్మాన్యువ‌ల్.. ఇప్పుడు ఈ భామ పేరు వింటేనే వ‌ణికిపోతున్నారు నిర్మాత‌లు. రెమ్యున‌రేష‌న్ ఎక్కువ అడుగుతుందేమో అని కాదు.. పాపం ఈ భామ ప్ర‌మేయం లేకుండానే ఐరెన్ లెగ్ అయిపోతుంది. అదేం పాప‌మో మ‌రి.. అను న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ భామ‌కు సంబంధం లేదు. ఒళ్లు దాచుకోకుండా క‌ష్ట‌ప‌డుతున్నా కూడా విజ‌య‌ల‌క్ష్మి క‌రుణించ‌క‌పోతే పాపం ఈ భామ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి.

Anu Emmanuel Considers Working With kalyaan Dhev

కానీ మ‌న ద‌గ్గ‌ర ఐరెన్ లెగ్ ముద్ర ప‌డితే సంబంధం లేకుండా హీరోయిన్ ను తిడుతుంటారు. దానికి తాను కార‌ణం కాద‌ని తెలిసినా కూడా త‌ప్పు చేయ‌క‌పోయినా శిక్ష మాత్రం అనుభ‌వించాల్సిందే. అది ఇండ‌స్ట్రీలో రూల్.. ఒక‌ట్రెండు ఫ్లాపులు రాగానే ఆ హీరోయిన్ పై ఐరెన్ లెగ్ ముద్ర వేస్తుంటారు ద‌ర్శ‌కులు. ఇప్పుడు అను ఎమ్మాన్యువ‌ల్ కూడా ఈ క‌ష్టం త‌ప్ప‌ట్లేదు.
ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేదు ఈ భామ కెరీర్ లో.

నానితో చేసిన మ‌జ్ను సినిమా యావ‌రేజ్.. ఆ త‌ర్వాత ఆక్సీజ‌న్.. అజ్ఞాత‌వాసి.. నా పేరు సూర్య డిజాస్ట‌ర్స్. మొన్న శైల‌జారెడ్డి అల్లుడు కూడా ఫ్లాపే. ఓపెనింగ్స్ వ‌ర‌కు ఓకే అనిపించి ఆ త‌ర్వాత మ‌ళ్లీ చేతులెత్తేసింది. దాంతో ఇప్పుడు అను ఎమ్మాన్యువ‌ల్ కెరీర్ కు ఎవ‌రు హిట్ ఇస్తారో అర్థం కావ‌డం లేదు. క‌చ్చితంగా ఇప్పుడు ఈ శైల‌జారెడ్డి కూతురుకు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇప్పుడు మెగా కంపౌండ్ నుంచి మ‌రో పిలుపు వ‌చ్చింది ఈ భామ‌కు.

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించ‌బోయే రెండో సినిమాలో అను ఎమ్మాన్యువ‌ల్ ను హీరోయిన్ గా తీసుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని పులివాసు తెర‌కెక్కిస్తున్నాడు. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు కానుంది. మొత్తానికి మెగా కంపౌండ్ మాత్రం అనుకు బాగానే అండగా నిలుస్తున్నారు. మ‌రి చిన్న‌ల్లుడు ఈ భామ కెరీర్ ను ఏం చేస్తాడో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here