రివ్యూ: అంత‌రిక్షం 9000 kmph

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 3.00 out of 5)
Loading...
movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

అంత‌రిక్షం.. సంక‌ల్ప్ నుంచి మ‌రో మంచి ప్ర‌య‌త్నం.. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం..
Rating: 2.5/5

www.teluguodu.com

రివ్యూ          : అంత‌రిక్షం 9000 kmph
న‌టీన‌టులు    : వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ,లావ‌ణ్య త్రిపాఠి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, రెహ‌మాన్
సంగీతం        : ప‌్ర‌శాంత్ విహారి
సినిమాటోగ్ర‌ఫీ  : జ‌్ఞాన‌శేఖ‌ర్
నిర్మాత‌లు     : క‌్రిష్, రాజీవ్ రెడ్డి
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి

ఘాజీ లాంటి సినిమా త‌ర్వాత సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో అంత‌రిక్షంపై ముందు నుంచి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి వాటిని ఈ సినిమా అందుకుందా లేదా..?

క‌థ‌:
దేవ్(వ‌రుణ్ తేజ్) ఇండియ‌న్ స్పేస్ సెంట‌ర్లో ఆస్ట్రానట్ గా ప‌ని చేస్తుంటాడు. విబ్ర‌యిన్ శాటిలైట్ ను స‌క్సెస్ ఫుల్ గా లాంఛ్ చేసినా కూడా అది స్పేస్ లోకి వెళ్లిన త‌ర్వాత దారి త‌ప్పుతుంది. దాంతో దేవ్ కూడా స్పేస్ సెంట‌ర్ వ‌దిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు వ‌దిలెళ్లిపోయిన దేవ్ ఐదేళ్ళ త‌ర్వాత మీరా శాటిలైట్ కోడ్ డీ కోడ్ చేయ‌డం కోసం మ‌ళ్లీ వ‌స్తాడు. అప్పుడు వ‌చ్చి స్పేస్ లోకి వెళ్తాడు. అక్క‌డ్నుంచి దేవ్ ఏం చేసాడు.. త‌న టీంతో క‌లిసి దేవ్ మీరా శాటిలైట్ ఫిక్స్ చేసాడా లేదా అనేది అస‌లు క‌థ‌..

విశ్లేష‌ణ‌:
ఘజీతో అద్భుతం చేసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. రెండో సినిమాకు స్పేస్ కథ తీసుకోవడం ఆసక్తి పుట్టించింది. దానికి తోడు ఆకట్టుకునే ట్రైలర్.. విజువల్స్ కూడా అంచనాలు పెంచేసాయి. ఆ నమ్మకంతోనే థియేటర్ లోకి వెళ్లాను.. ఘజీ మాదిరే టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు. తొలి సీన్ నుంచే ఎదో చేస్తున్నారు అనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ వేగంగానే పూర్తి అయింది.. కానీ కథలో ఆ వేగం కనిపించలేదు.. స్పేస్ లోకి వెళ్లిన తర్వాత కథ అక్కడే ఆగిపోయింది. ముందుకు వెనక్కి వెళ్లలేక స్పేస్ లొనే ఆగిపోయింది కథ.. దానికి తోడు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష తెలుగు అయినా.. ఆస్ట్రోనట్ కోడ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోవడం మైనస్.. కానీ దానికి వేరే ఆప్షన్ లేదు.. అక్కడ అదే మాట్లాడాలి.. కథ చిన్నది కావడం అంతరిక్షంకు ప్రతికూలం.. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కవుట్ కాలేదు.. వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు.. మిగిలిన వాళ్ళు బాగా నటించారు.. దర్శకుడిగా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సంకల్ప్ అభిరుచి అభినందనీయం.. ఓవరాల్ గా అంతరిక్షం ప్రయత్నం బాగుంది.. కానీ అనుకున్నంత మాత్రం ఆసక్తి పుట్టించ‌లేదు.

న‌టీన‌టులు:
వ‌రుణ్ తేజ్ త‌న పాత్ర‌కు న్యాయం చేసాడు. దేవ్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా ఆయ‌న డైలాగ్ డెల‌వ‌రీ బాగుంది. క‌ష్ట‌మైన ప‌దాలు కూడా ఈజీగా ప‌లికేసాడు. ఇక ఆయ‌న త‌ర్వాత అదితిరావు హైద‌రీ పాత్ర బాగుంది. హీరోకు తోడుగా ఉండే పాత్ర‌లో ప్రాణం పోసింది. లావ‌ణ్య త్రిపాఠి క‌నిపించేది కాసేపే అయినా కూడా అల‌రించింది. ఆమె పాత్ర బాగా డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు. రెహ‌మాన్ స్పేస్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ గా బాగున్నాడు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌దేవ్, రాజా అంతా త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఘాజీ మాదిరే మ‌రోసారి మంచి క్యాస్టింగ్ తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్.

టెక్నిక‌ల్ టీం:
టెక్నిక‌ల్ టీం త‌మ ప‌ని చ‌క్క‌గా చేసారు. ఈ టీంలో అంద‌రికంటే ఎక్కువ మార్కులు సినిమాటోగ్ర‌ఫర్ జ్ఞాన‌శేఖ‌ర్ కు ప‌డతాయి. మంచి విజువ‌ల్స్ తో సినిమా రేంజ్ పెంచేసాడు ఈయ‌న‌. ద‌ర్శ‌కుడు చెప్పింది అర్థం చేసుకుని అనుకున్న ఔట్ పుట్ ఇచ్చాడు జ్ఞాన‌శేఖ‌ర్. ఇక సంగీతం కూడా బాగుంది. ప్ర‌శాంత్ విహారి ఈ బాధ్య‌త‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తించాడు. స‌మ‌య‌మా పాట బాగుంది. ఫ‌స్టాఫ్ అంతా బాగానే స్క్రీన్ ప్లే న‌డిచినా కూడా సెకండాఫ్ లో క‌థ అక్క‌డే ఆగిపోయింది. ముఖ్యంగా అక్క‌డ వాళ్లు మాట్లాడే ఆస్ట్రాన‌ట్ భాష అర్థం కాలేదు. ఓవ‌రాల్ గా ఘాజీ స్థాయిలో కాదు కానీ ప‌ర్లేద‌నేలా ఈ అంత‌రిక్షం ఉంది..

చివ‌ర‌గా:
అంత‌రిక్షం.. సంక‌ల్ప్ నుంచి మ‌రో మంచి ప్ర‌య‌త్నం.. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here