మోడ్ర‌న్ మహాన‌టిగా మారిపోయిన అన‌సూయ‌.. 

ఈ మ‌ధ్య ఏమైందో ఏమో తెలియ‌దు కానీ అన‌సూయ అస్స‌లు ఆగ‌డం లేదు. ఒక్కో రోజు ఒక్కో పోజ్ ఇచ్చి ఊపిరి ఆపేస్తుంది ఈ భామ‌. గ్లామ‌ర్ పోజుల నుంచి కాస్త సైడ్ ఇచ్చి చీర‌కట్టులో ఉడికిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం చ‌క్క‌గా చీర‌లో తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

చీర‌క‌ట్టులో ఆమె పోజులు చూసి అబ్బో అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. బాపుబొమ్మ‌లా చూడ‌చ‌క్క‌ని బుట్ట‌బొమ్మ‌లా మారిపోయింది అన‌సూయ‌. మొన్న‌టి వ‌ర‌కు థండ‌రింగ్ థైస్ చూపిస్తూ మ‌తులు పోగొట్టిన అనుకు ఇప్పుడు తెలుగ‌మ్మాయిలా మారిపోవాల‌ని అనిపించిన‌ట్లుంది. అనుకున్న‌దే త‌డువుగా అలా మారిపోయింది. చీర‌లోనే మ‌తులు చెడ‌గొడుతుంది అను.
చంద‌న బ్ర‌ద‌ర్స్ యాడ్ కోసం ఏకంగా మ‌హాన‌టిని కాపీ కొట్టేసారు మేక‌ర్స్. అందులో మోడ్ర‌న్ మ‌హాన‌టిగా మారిపోయి.. పెళ్లి పాట‌లో చిందేసింది అన‌సూయ‌. అహ‌నా పెళ్లంట పాట‌నే కాస్త మార్చి త‌మ యాడ్ కోసం వాడేసుకున్నారు యాడ్స్ టీం. ఎప్ప‌టికప్పుడు ట్రెండింగ్ గా మారిపోతూ ఫోటోషూట్ ల‌లో బిజీగా ఉంటుంది ఈ భామ‌. అందాల రాక్ష‌సిలా క‌వ్విస్తుంటుంది. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు రేంజ్ లో రెచ్చిపోతోంది అన‌సూయ‌.
Anchor Anasuya as Mahanati
Anchor Anasuya as Mahanati
ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. నేనేంటో చూపిస్తా అనే రేంజ్ లో త‌న హాట్ షోతో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ. ఓ వైపు ఫోటోషూట్ల‌తో పాటు మ‌రోవైపు సినిమాలోనూ బిజీగా ఉంది ఈ భామ‌. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2లో న‌టిస్తుంది అన‌సూయ‌. ఇందులో వ‌రుణ్ తేజ్, వెంక‌టేశ్ హీరోలు. కీల‌క‌మైన పాత్ర‌లోనే అన‌సూయ ఇందులో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి అను టైమ్ అలా న‌డుస్తుందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here