అయ్యో AMB మ‌ల్టీప్లెక్స్ మ‌ళ్లీ వాయిదా..

థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ తోనే రావాల్సిన మ‌హేష్ బాబు మ‌ల్టీప్లెక్స్ ఇంకా రాలేదు. ఇప్పుడు 2.0 తో వ‌స్తుందేమో అనుకుంటే ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. మ‌రోసారి ఈ మ‌ల్టీప్లెక్స్ ఓపెనింగ్ ఆగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ జాయింట్ వెంచర్ కాబ‌ట్టి దీనికి ఏసియ‌న్ నుంచి ఏ.. మ‌హేష్ బాబు నుంచి ఎమ్ బి తీసుకున్నారు. అలా ఇది ఏఎమ్ బి మ‌ల్టీప్లెక్స్ అయిపోయింది. నవంబర్ 29న 2.0 సినిమాతోనే ఇది ప్రారంభం కావాల్సి ఉండగా లేజర్ స్క్రీనింగ్ పనులు ఆలస్యం కావడం వల్ల వాయిదా పడింది.
amb cinema
డిసెంబర్ 2న ఈ మల్టీఫ్లెక్స్ భారీ స్థాయిలో ఓపెన్ కానుంద‌ని.. అప్పుడు కూడా 2.0 సినిమాతోనే మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. దీనికోసం ఇప్ప‌టికే 3డి వ‌ర్ష‌న్ కూడా సిద్ధం చేసారు. 1638 సీటింగ్ కెపాసిటీతో ఏడు స్క్రీన్ లు ఇందులో ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లోనే ఇదే పెద్ద స్క్రీనింగ్ అని తెలుస్తుంది. దీని కోసం మ‌హేష్ బాబు కూడా భారీగానే ఖ‌ర్చు చేసారు. ఇందులో 150 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌చ్చిబౌలి ఓపెన్ స్థ‌లాల్లో ఈ మ‌ల్టీప్లెక్సుల నిర్మాణం పూర్త‌యింది. మ‌రోవైపు మ‌ల్టీప్లెక్సులే కాదు.. కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్ప‌టికే తాను చాలా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు.
ఇందులోనే ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ ల‌తో పాటు మ‌రికొన్ని బిజినెస్ ల‌పై కూడా మ‌హేశ్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మ‌రోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here