రివ్యూ: అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ

CRITICS METER

Average Critics Rating: 2
Total Critics:3

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. ఇట్స్ ఏ శీనువైట్ల ఎండ్..ఓవ‌ర్
Rating: 2.5/5

www.teluguodu.com

అసహనం అయోమయం ఆందోళన!
Rating: 2/5

www.greatandhra.com

అమర్ అక్బర్ ఆంటొని – ఆకట్టుకోని రివెంజ్ డ్రామా
Rating: 2.5/5

www.123telugu.com

రివ్యూ                : అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ
న‌టీన‌టులు          : ర‌వితేజ‌, ఇలియానా, త‌రుణ్ అరోరా, సాయాజీ షిండే,సునీల్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం              : థ‌మ‌న్
నిర్మాణం             : మైత్రి మూవీ మేక‌ర్స్
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు  : శ్రీ‌నువైట్ల‌

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. కొన్ని రోజులుగా బాగానే వినిపిస్తున్న పేరు. నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను త‌ర్వాత ర‌వితేజ‌, శీనువైట్ల చేసిన నాలుగో సినిమా ఇది. మ‌రి ఇది వ‌ర్క‌వుట్ అయిందా.. మైత్రి మూవీ మేక‌ర్స్ కు మ‌రో హిట్ తీసుకొచ్చిందా..? ఇద్ద‌ర్నీ ఫ్లాపుల నుంచి బ‌య‌ట ప‌డేసిందా..?

క‌థ‌:
అమ‌ర్(ర‌వితేజ‌), ఐశ్వ‌ర్యా(ఇలియానా) పేరెంట్స్ చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్స్. ఈ ఇద్ద‌రూ కూడా అలాగే పెరుగుతారు. అమెరికాలో ఫిడో కంపెనీకి ఓన‌ర్స్. అయితే వాళ్ల కంపెనీలో ప‌నిచేసే న‌లుగురు ఉద్యోగులు ఆస్తి కోసం అంద‌ర్నీ చంపేస్తారు. కానీ ఆ యాక్సిడెంట్ నుంచి అమ‌ర్, ఐషూ బ‌య‌ట ప‌డ‌తారు. ఆ త‌ర్వాత ఓ హ‌త్య కేసులో జైలుకు వెళ్తాడు అమ‌ర్. కానీ అమ‌ర్ చ‌నిపోయాడేమో అనుకుంటుంది ఐష్. జైలు నుంచి వ‌చ్చిన త‌ర్వాత త‌న కుటుంబాన్ని నాశ‌నం చేసిన వాళ్ల‌పై ఒక్కొక్క‌రిగా చంపేస్తుంటాడు అమ‌ర్. అదే స‌మ‌యంలో త‌న‌కు తెలియ‌కుండానే అమ‌ర్ కాస్తా అప్పుడ‌ప్పుడు అక్బ‌ర్, ఆంటోనీల్లా మారిపోతుంటాడు.. అలా ఎందుకు మార‌తాడు.. అస‌లు అమ‌ర్ కాస్తా అక్బ‌ర్, ఆంటోనీగా ఎందుకు మారిపోతాడు అనేది క‌థ‌..

క‌థ‌నం:
మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అని లెక్కలు చెబుతాయి.. కానీ ఒక్కోసారి ఒకేసారి చాలా మైనస్ లు కలిసినా కూడా సమస్యే. అమర్ అక్బర్ అంటోనీ చూస్తుంటే ఇదే అనిపించింది. రవితేజ ఏం అడిగినా వెయిట్ అండ్ సీ అంటుంటే.. శీనువైట్ల సీన్ సిరిగిపోతుంది చూడండి అంటే.. ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రంలో చాలా విష‌యం ఉందేమో అందుకే ర‌వితేజ ఇంత న‌మ్మ‌కంగా ఉన్నాడు అనుకున్నారు. కానీ హ్యాట్రిక్ ప్లాపుల హ్యాంగోవర్ నుంచి శీనువైట్ల ఇంకా దిగలేదేమో మరి.. అది ఇందులోనూ కనిపించింది. కథ కొత్తగా ఉంటది అని చెప్పాడు శీనువైట్ల కానీ చూసిన తర్వాత ఓ విషయం అర్థం అయింది. ఇది శీనువైట్లకి కొత్త కానీ.. మనకి కాదు.. అతనొక్కడే అనే సినిమా ఒకటి వచ్చిందని అతను మర్చిపోయాడు.. 13 ఏళ్ల కింద హైదరాబాద్ లో జరిగిన కథనే.. ఇప్పుడు అమెరికాకు షిఫ్ట్ చేసాడు వైట్ల. స్క్రీన్ ప్లే అక్కడక్కడా బాగుంది కానీ.. చాలాచోట్ల రొటీన్ అనిపించింది..
ముఖ్యంగా కథ చాలా రొటీన్.. అదే సినిమాకు మెయిన్ మైనస్.

తొలి 15 నిమిషాల్లోనే కథ చెప్పాడు దర్శకుడు.. కానీ తర్వాత కథ లేక వాటా అంటూ నాట.. ఆటలపై పడ్డాడు. టైం బాగున్నపుడు ఎన్ని సెటైర్లు వేసినా పర్లేదు కానీ ఇప్పుడు కాదు.. వాటా కామెడీ బలవంతంగా ఇరికించినట్టు అనిపించింది.. సెకండాఫ్ లో సునీల్ కాస్త బెటర్. పాత సునీల్ మళ్ళీ కనిపించాడు.. ఉన్నది కొన్ని సీన్స్ అయినా నవ్వించాడు. ఇక రవితేజకి మల్టిపుల్ డిసార్డర్ పెట్టి అపరిచితుడుని అడుగడుగునా గుర్తు చేసారు.. దానికితోడు అతనొక్కడే ఉండనే ఉంది.. ఎటు చూసినా దర్శకుడు చెప్పిన కొత్త కథ కనబడలేదు. రవితేజ మూడు రోల్స్ లో బాగా నటించాడు కానీ కథ కుదరలేదు.. ఇలియానా పర్లేదు.. డబ్బింగ్ కూడా బాగానే చెప్పుకుంది. కానీ శీనువైట్ల మరోసారి నిరాశ పరిచాడు.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ పేరుతో కథ గాలికి వదిలేసాడేమో అనిపించింది. ఒకప్పుడు ఆయనకి కలిసొచ్చిన సెటైర్ ఇప్పుడు శాపం అయింది.. కామెడీ ఏడిపించింది. మొత్తానికి అమర్ అక్బర్ ఆంటోనీలో కథ లేదు.. స్టైల్ తప్ప. పాపం రంగస్థలంలో కలిసొచ్చిన ప్రతీకారం.. మైత్రికి ఇప్పుడు కలిసిరాలేదు. చివరగా శీనువైట్ల మరోసారి పగ తీర్చుకున్నాడు..

న‌టీన‌టులు:
ర‌వితేజ మూడు పాత్ర‌ల్లోనూ బాగున్నాడు. ముఖ్యంగా ఆంటోనీ పాత్ర కొత్త‌గా అనిపించింది. డాక్ట‌ర్ గా న‌వ్వించాడు. అక్బ‌ర్ బాగున్నాడు. అమ‌ర్ సెన్సిబుల్ గా చేసాడు. కానీ క‌థే కుద‌ర్లేదు. ఇలియానా ప‌ర్లేదు.. ఫిజిక్ విష‌యంలో లెక్క త‌ప్పింది. డ‌బ్బింగ్ బాగానే చెప్పుకుంది. సునీల్ ఒక్క‌డే ఉన్నంత‌లో కాస్త న‌వ్వించాడు. కానీ చాలా త‌క్కువ సీన్స్ కు ప‌రిమితం చేసాడు. ఇంకాసేపు ఉన్నా బాగుండేదేమో..? ఇక ఫ‌స్టాఫ్ లో వాటా అంటూ నాటా స‌భ‌ల‌పై సెటైర్లు వేసాడు శీనువైట్ల‌. దానికి వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, స‌త్య‌, రఘుబాబు బ్యాచ్ తీసుకొచ్చాడు. కానీ అది కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. స‌త్య ఒక్క‌డే న‌వ్వించాడు. విల‌న్స్ గా అంద‌రూ రొటీన్.. అభిమ‌న్యు సింగ్ అయితే త‌ట్టుకోలేం.. చూడ‌లేం.

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ అంటేనే రొటీన్ అని అర్థం. ఎప్పుడో కానీ ఆయ‌న నుంచి కొత్త‌ద‌నం ఊహించ‌లేం. ఈ సారి రొటీన్ క‌థ‌కు తోడు మ‌రింత రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడు థ‌మ‌న్. అస‌లు ఆర్ఆర్ కూడా ఆక‌ట్టుకోలేదు. ఒక్క పాట కూడా అర్థం కాలేదు. అంత రొటీన్ అనిపించింది. ఏదో మొక్కుబ‌డిగా పాట‌లు ఇచ్చిన‌ట్లే అనిపించింది. ఎడిటింగ్ చాలా వీక్. రెండున్న‌ర గంట‌లు ఉండ‌టంతో చాలా సాగ‌దీసిన‌ట్లు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే క‌థ‌తో ప‌ని లేకుండా మ‌ధ్య‌లోకి వ‌చ్చాయి. సినిమాటోగ్ర‌పీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడు శీనువైట్ల మాత్రం మ‌రోసారి పూర్తిగా నిరాశ ప‌రిచాడు. ఆయ‌న ఎందుకో తెలియ‌దు కానీ మ‌రి అత‌నొక్క‌డే.. అప‌రిచితుడు చూడ‌లేదేమో..? చూసినా ప్రేక్ష‌కులు మ‌రిచిపోయుంటారు అనుక‌న్నాడు. అందుకే అదే క‌థ‌ను తీసుకొచ్చి రివేంజ్ డ్రామాగా అల్లేసాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ కు మ‌రో షాక్ త‌ప్పేలా లేదు.

చివ‌ర‌గా:
అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. ఇట్స్ ఏ శీనువైట్ల ఎండ్..ఓవ‌ర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here