అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ప్రీమియ‌ర్ షో టాక్..

వ‌చ్చేసింది.. ర‌వితేజ ఎప్ప‌ట్నుంచో క‌ల‌లు కంటున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ వ‌చ్చేసింది.. శీనువైట్ల ప్రాణాలు పెట్టుకున్న సినిమా విడుద‌లైంది. ఇక ఇప్పుడు ఈ చిత్ర టాక్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. ఆగ‌డు, బ్రూస్లీ, మిస్ట‌ర్ లాంటి హ్యాట్రిక్ ఫ్లాపుల త‌ర్వాత శీనువైట్ల‌కు కాస్త మ‌న‌శ్శాంతిని ఇచ్చేలా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టాక్ ఉంది.

AAA

ఈ చిత్రం ప‌ర్లేదు అనే స్థాయిలోనే ఓపెన్ అయింది. అన్నిచోట్ల నుంచి ప‌ర్లేదు అనే రిపోర్ట్స్ తెచ్చుకుంది కానీ బాగోలేదు అని మాత్రం ఎవ‌రూ చెప్ప‌డం లేదు. ఇదే ఇప్పుడు ర‌వితేజ‌కు కాస్త క‌లిసొచ్చే అంశం. దానికి తోడు కొత్త క‌థ‌, కారెక్ట‌ర్ డిజైనింగ్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయంటున్నారు ప్రేక్ష‌కులు. ఫ్లాపుల ఎఫెక్ట్ తో శీనువైట్ల ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఈ చిత్రం చేసిన‌ట్లు అర్థ‌మైపోతుంది. పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 22 కోట్లే చేయ‌డంతో టాక్ కాస్త బాగా వ‌చ్చినా కూడా ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు ర‌వితేజ‌.

ఇప్పుడు టాక్ అయితే యావ‌రేజ్ గానే వ‌చ్చింది. అందుకే హిట్ కొట్టేద్దాం అనుకుంటున్నాడు మాస్ రాజా. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో అమెరికాలోని తెలుగు ఆర్గ‌నైజేష‌న్స్ పై బాగానే సెటైర్లు పేల్చాడు శీనువైట్ల‌. ఇవి బాగానే వ‌ర్క‌వుట్ అయింద‌ని కూడా తెలుస్తుంది. వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, సునీల్ లాంటి వాళ్ల‌పై క‌డుపులు చెక్క‌ల‌య్యే సీక్వెన్సులు రాసుకున్నాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టాక్ అయితే పాత క‌థ‌నే కాస్త ఫ్రెష్ గా రాసుకుని తెర‌కెక్కించాడు శీనువైట్ల‌. ఇప్పుడు టాక్ కూడా ప‌ర్లేద‌నేలా వ‌చ్చింది. మ‌రి ఈ టాక్ తో సినిమా ఎంత దూరం వెళ్తుంద‌నేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here