అమ‌లాపాల్ ను ఎవ‌రైనా ఆపండ‌య్యా..?

ఇప్పుడు ఇదే అంటున్నారు అమ‌లాపాల్ జోరు చూసి. అటు నోరు.. ఇటు అందాల ఆర‌బోత‌లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ఈ భామ‌. గ్లామ‌ర్ షోతో పాటు సెన్సేష‌న‌ల్ క‌మెంట్స్ తో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అయినా ఏమైందో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య అమ‌లాపాల్ త‌న ఇంట్లో కంటే ఎక్కువ‌గా హెడ్ లైన్స్ లోనే ఉంటుంది. ఏదో ఒక‌టి చేసి ఎప్పుడూ వార్త‌ల్లో ఉండ‌టం ఈ భామ‌కు అల‌వాటుగా మారిపోయింది.

Amala Paul Comments About Her Second Marriage

దానికోసం దేనికైనా సిద్ధం అంటుంది. ఇప్పుడు రెండో పెళ్లి క‌మెంట్స్ తో వార్త‌ల్లోకి వ‌చ్చింది అమలా. పెళ్లికి ముందు.. పెళ్లి త‌ర్వాత అమ్మాయిల్లో మార్పులు వ‌స్తాయి అంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు అమ‌లాపాల్ ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈమెకు ఏదో అయిపోయింది. హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ఇంత గ్లామ‌ర్ షో చేయ‌లేదు అమ‌లాపాల్.. కానీ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ను పెళ్లాడి విడాకులు తీసుకున్న త‌ర్వాత మాత్రం అమ‌లాపాల్ లో చాలా మార్పులు వ‌చ్చాయి. అస‌లు భ‌ర్తపై ఉన్న కోపమో.. లేదంటే మ‌రే కార‌ణ‌మో ఏమో గానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోతుంది.

ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగ‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా తాను రెండో పెళ్లికి రెడీ అంటూనే.. కారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా న‌టించ‌డానికి కూడా ఆలోచించ‌ను అంటుంది. ఈ మ‌ధ్యే ఓ మ‌ళ‌యాలం సినిమా కోసం ఏకంగా సిగ‌రెట్లు కాలుస్తూ.. మందు తాగుతూ ర‌చ్చ చేసింది. అంతేకాదు.. త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి కూడా వ‌స్తానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే ఎవ‌రైనా కాస్త అమ‌ల‌పాల్ ను ఆపితే బాగున్ను.. లేదంటే ఈ ర‌చ్చ‌తో గూగుల్ కూడా షేక్ అయిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *