బ‌న్నీ-త్రివిక్ర‌మ్.. జ‌న‌వ‌రి వ‌ర‌కు ఆగాలి బాసూ..

అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు అంటూ ఇప్పుడు అప్పుడూ అని తెలుస్తుంది కానీ ఎప్పుడో మాత్రం క‌చ్చితంగా తెలియ‌డం లేదు. ఇప్పుడు ఆ అప్పుడు ఎప్పుడో తెలుస్తుంది. జ‌న‌వ‌రి నుంచి బ‌న్నీ కొత్త సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏడేళ్ల త‌ర్వాత నిఖార్సైన ఫ్లాప్ త‌గ‌ల‌డంతో త‌ర్వాతి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల‌కు పైగా న‌ష్టాల్ని తీసుకొచ్చాడు నా పేరు సూర్య‌. దాంతో ఈ సారి ఏ ప్ర‌యోగాలు లేకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ ఒక‌టి సిద్ధం చేయాల్సిందిగా త‌న ద‌గ్గ‌రికి వ‌స్తున్న ద‌ర్శ‌కుల‌కు చెబుతున్నాడు బ‌న్నీ. త్రివిక్ర‌మ్ క‌థ ఫైన‌ల్ అయినా కూడా ఎందుకో తెలియదు కానీ బ‌న్నీ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రికి పోస్ట్ పోన్ అయింద‌ని తెలుస్తుంది.

Allu Arjun Trivikram Film Getting Delayed

ఎవ‌రు మంచి క‌థ తీసుకొస్తే వాళ్ల‌తో సినిమా చేయ‌డానికి బ‌న్నీ సిద్ధంగా ఉన్నాడిప్పుడు. కాక‌పోతే ఆ క‌థ రావ‌డం ఆల‌స్యం అంతే. ఇప్ప‌టికే విక్ర‌మ్ కే కుమార్ చెప్పిన క‌థ ఒక‌టి న‌చ్చింద‌ని తెలుస్తుంది. అయితే అందులో మార్పులు చేయాల్సిందిగా బ‌న్నీ కోరాడు.. అయితే సెకండాఫ్ మార్చినా కూడా బ‌న్నీకి న‌చ్చ‌లేదు. దాంతో ఇప్పుడు ఇదే క‌థ‌ను నానితో చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు విక్ర‌మ్. కొర‌టాల అనుకున్నా ఆయ‌న చిరంజీవి కోసం క‌థ రాస్తున్నారు. త్రివిక్ర‌మ్ సినిమా దాదాపు ఫైన‌ల్ అయిందని తెలుస్తున్నా కూడా ఇప్పుడు మ‌ళ్లీ రెండు నెల‌లు ఆగాలంటున్నాడు. త‌ర్వాతి సినిమా ఏంటి అంటే తెలిసిన త‌ర్వాత చెప్తానంటూ అభిమానులను స‌ముదాయించాడు అల్లు వార‌బ్బాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం త్రివిక్ర‌మ్ తోనే సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో మూడో సినిమా వ‌స్తుందో రాదో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here