అల్లు అర్జున్ టీ షర్ట్ రేట్ తెలిస్తే షాక్..

అల్లు అర్జున్ అంటేనే స్టైలిష్ స్టార్. ఆయ‌నేం చేసినా స్టైల్ గానే ఉంటుంది. ఇప్పుడు టాక్సీవాలా ఈవెంట్ కు ఈయ‌న వేసుకొచ్చిన టీ ష‌ర్ట్ ట్రెండింగ్ అవుతుంది. ఈ టీష‌ర్ట్ గురించి.. దాని పుట్టు పూర్వోత్త‌రాల గురించి ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది. బ‌న్నీ ధ‌రించిన ఈ ఔట్ ఫిట్ కంపెనీ గివెన్ చై. మ‌న ద‌గ్గ‌ర పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా కూడా చాలా పెద్ద కంపెనీ. ఇందులో ఒక్కో టీ ష‌ర్ట్ వ్యాల్యూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏడాది పాటు ఫుడ్డు వ‌చ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు బ‌న్నీ వేసుకున్న టీ ష‌ర్ట్ కూడా 66 వేలు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ లో ఉన్న ఈ టీ ష‌ర్ట్ అదిరిపోయిందంతే.

Allu Arjun T-shirt cost
Allu Arjun T-shirt cost

ఇదే ఇప్పుడు బ‌న్నీ ఫ్యాన్స్ కూడా ఆన్ లైన్ లో స‌ర్చ్ చేస్తున్నారు. దీనికి స‌మాధానంగానే కంపెనీ ఫోటోల‌తో పాటు రేట్ కూడా దొరికింది. అది చూసిన త‌ర్వాత వాళ్ల గుండెలు ఆగిపోతున్నాయి. ఎంతైనా స్టైలిష్ స్టార్ కదా.. ఆ మాత్రం రేంజ్ మెయింటేన్ చేస్తాడు. లేదంటే ఎలా..? టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుక మొత్తం బ‌న్నీ టీ ష‌ర్ట్ బాగా హైలైట్ అయింది. ఇంత స్పెష‌ల్ గా ఎందుకు వేసుకొచ్చాడ‌బ్బా అనుకున్న వాళ్ల‌కు రేట్ చూసిన త‌ర్వాత క్లారిటీ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఈయ‌న నెక్ట్స్ ఏంటి అనే ప‌నిలోనే బిజీగా ఉన్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఇదిగో ఇలా అంద‌రి వేడుక‌ల‌కు వెళ్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బ‌న్నీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here