పాత పాటే పాడిన బ‌న్నీ.. ఇంకొన్నాళ్లు వెయిటింగ్.

త‌ప్ప‌దు.. ఒక్క‌సారి కెరీర్ లో ఎవ‌రికైనా ఇలాంటి సిచ్యువేష‌న్ వ‌స్తుంది. ఇప్పుడు బ‌న్నీకి కూడా వ‌చ్చింది. ఇదివ‌ర‌కు ఓ సినిమా పూర్తి కాగానే.. మ‌రో రెండు సినిమాల‌ను లైన్ లో పెట్టిన అల్లుఅర్జున్.. ఇప్పుడు నా పేరు సూర్య విడుద‌లై ఐదు నెలలు పూర్తైనా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా ఏంటి అనేది కూడా చెప్ప‌ట్లేదు. దానికి కార‌ణం నా పేరు సూర్య ఫ్లాప్ అవ్వ‌డ‌మే కాదు.. స‌రైన క‌థ దొర‌క్క‌పోవ‌డం కూడా.

alluarjun

ఏడేళ్ల త‌ర్వాత నిఖార్సైన ఫ్లాప్ త‌గ‌ల‌డంతో త‌ర్వాతి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల‌కు పైగా న‌ష్టాల్ని తీసుకొచ్చాడు నా పేరు సూర్య‌. దాంతో ఈ సారి ఏ ప్ర‌యోగాలు లేకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ ఒక‌టి సిద్ధం చేయాల్సిందిగా త‌న ద‌గ్గ‌రికి వ‌స్తున్న ద‌ర్శ‌కుల‌కు చెబుతున్నాడు బ‌న్నీ.
ఎవ‌రు మంచి క‌థ తీసుకొస్తే వాళ్ల‌తో సినిమా చేయ‌డానికి బ‌న్నీ సిద్ధంగా ఉన్నాడిప్పుడు. కాక‌పోతే ఆ క‌థ రావ‌డం ఆల‌స్యం అంతే. ఇప్ప‌టికే విక్ర‌మ్ కే కుమార్ చెప్పిన క‌థ ఒక‌టి న‌చ్చింద‌ని తెలుస్తుంది. అయితే అందులో మార్పులు చేయాల్సిందిగా బ‌న్నీ కోరుతున్నాడు.

సెకండాఫ్ ను ఇప్పుడు హీరోకు న‌చ్చే విధంగా మార్చినా కూడా కాద‌నుకున్నాడ‌ని తెలుస్తుంది. దాంతో అదే క‌థ‌ను ఇప్పుడు నానితో చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు విక్ర‌మ్. ఇక కొర‌టాల అనుకున్నా ఆయ‌న చిరంజీవి కోసం క‌థ రాస్తున్నారు. త్రివిక్ర‌మ్ సినిమా దాదాపు ఫైన‌ల్ అయిందని తెలుస్తున్నా కూడా ఇప్పుడు ట్విట్ట‌ర్ లో మాత్రం త‌న త‌ర్వాతి సినిమా కోసం ఇంకొన్నాళ్లు ఆగాల‌ని సూచించాడు బ‌న్నీ. త‌ర్వాతి సినిమా ఏంటి అంటే తెలిసిన త‌ర్వాత చెప్తానంటూ అభిమానులకు స‌ముదాయించాడు అల్లు వార‌బ్బాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం త్రివిక్ర‌మ్ తోనే సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో మూడో సినిమా వ‌స్తుందో రాదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here