శిఖ‌రంపై ఉన్న అల్లు అర్జున్.. తీసుకెళ్లిన ఫ్యాన్..

అల్లు అర్జున్ అంటే కేవ‌లం తెలుగు హీరో అనే భ్ర‌మ‌ల్లో ఉంటే క‌ష్టం. ఎందుకంటే ఈయ‌న పేరు ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు పాకింది. ఇంకా మాట్లాడితే ప‌క్క దేశాల్లో కూడా బ‌న్నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈయ‌న ఫ్యాన్ ఒక‌రు నేపాల్ వెళ్లి అక్క‌డ శిఖ‌రం ఎక్కించాడు. ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద చెరువు అయిన టిలిచో ద‌గ్గ‌రికి ప్రాణాల‌కు తెగించి మ‌రీ వెళ్లి.. అక్క‌డ అభిమాన హీరో అల్లు అర్జున్ ఫోటో చూపించాడు.

Allu arjun fans adventure peaks

ఆ ఫ్యాన్ పేరు మ‌హేష్ బ‌ర‌ల్. దేశం నేపాల్.. ఎక్క‌డో నేపాల్ లో ఉన్న మ‌హేష్ బ‌ర‌ల్ కు అల్లు అర్జున్ ఎలా ప‌రిచ‌యం అనే అనుమానం కూడా రావ‌చ్చు కానీ అక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. మ‌హేష్ కు మ‌న భాష రాదు కానీ బ‌న్నీని అభిమానిస్తాడు. సోష‌ల్ మీడియాలో బ‌న్నీ చేసే ప్ర‌తీ ప‌ని పాలో అవుతాడు. అలాగే అల్లు వార‌బ్బాయికి ఫ్యాన్ అయిపోయాడు మ‌హేష్. ఇక ఇప్పుడు ఈయ‌న వెళ్లిన చెరువు స‌ముద్ర మ‌ట్టం నుంచి 17,769 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్క‌డికి వెళ్ల‌డం కాదు చూస్తేనే ప్రాణాలు పోయినంత ప‌ని అవుతుంది.

అలాంటి చోటికి బ‌న్నీ ఫ్యాన్ వెళ్లాడు. మొత్తం 7 రోజుల ఈ ప్ర‌యాణంలో 5 రోజుల పాటు తొరాంగ్ లా పాస్ ప‌ర్వతాన్ని చేరుకోడానికి ప‌ట్టింది. ప్రాణాల‌కు తెగించి మ‌రీ అక్క‌డికి చేరుకున్నాడు మ‌హేష్ బ‌రాల్. ఇలా అభిమాన హీరోల కోసం అబిమానులు సాహ‌సాలు చేయ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో చిరంజీవి.. ర‌జినీకాంత్ లాంటి హీరోల కోసం అభిమానులు ఇలాగే చేసారు. ఇక ప‌వ‌న్ కోసం బెంగాల్ నుంచి హైర‌దాబాద్ వ‌ర‌కు సైకిల్ తొక్కాడు. మొత్తానికి మ‌న హీరోల‌ను చూస్తుంటే ఇప్పుడు నిజంగానే గ‌ర్వంగా అనిపిస్తుంది క‌దా. బాలీవుడ్ హీరోల‌కు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *