ఈ ఫోటో చూస్తుంటే ఇప్పుడు ఇదే అనాలనిపిస్తుంది కదా. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడనేది ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. నా పేరు సూర్య తర్వాత ఈయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. కుటుంబానికి చేరువగా ఉన్నాడు. ఎం చక్కా దొరికిన టైమ్ ఇప్పుడు తన ఫ్యామిలీతో గడిపేస్తున్నాడు. ఇప్పుడు కూడా అమ్మా నాన్నలతో పాటు అన్నాదమ్ములు కలిసి హాయిగా ట్రిప్ వెళ్లారు.
అక్కడే అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఓ ఫోటోకు పోజిచ్చారు. అప్పుడెప్పుడో ఇలా అల్లు వారంతా కలిసి పోజు ఇవ్వడం తప్పితే ఇప్పటి వరకు మళ్లీ అలా కలవలేదు. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు మళ్లీ కలిసారు. ఎప్పుడూ అల్లు అర్జున్ -స్నేహ బయట కనిపిస్తూనే ఉంటారు. ఇక శిరీష్ కూడా సోలోగా కనిపిస్తుంటాడు.
అల్లు అరవింద్ ఎక్కడైనా వేడుకలు జరిగినపుడు తప్ప బయట కనిపించడం అరుదు. ఇక ఆయన పెద్ద కొడుకు అయితే ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు అంతా కలిసి ఒకే ఫోటోలో దర్శనమిచ్చారు. ఇదిలా ఉంటే బన్నీ తర్వాత సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. విక్రమ్ కే కుమార్ తో చివరివరకు ఉంటుందనుకున్న ప్రాజెక్ట్ కాస్తా ఆగిపోయింది. దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చాడు. మరోవైపు శిరీష్ కూడా దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్ హిట్ ABCD రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్ లోనే కుటుంబం అంతా కలిసి ఇలా ట్రిప్ కు వచ్చారన్నమాట. ఇది కూడా అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొన్న దసరా కూడా మామగారి ఊళ్లో సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ.