ర‌వితేజ చుట్టూ తిరుగుతున్న బ‌న్నీ ద‌ర్శ‌కుడు..

 

ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు.. ఆ ద‌ర్శ‌కున్ని హీరోలు ప‌ట్టించుకోమ‌న్నా కూడా ప‌ట్టించుకోరు. అది ఇండ‌స్ట్రీలో సాధార‌ణంగా క‌నిపించే సీన్. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడికి కూడా ఇదే జ‌రుగుతుంది. కాక‌పోతే ఇక్క‌డ మ‌రో విచిత్రం కూడా ఉంది. ఆయ‌న ఏ హీరో చుట్టూ అయితే తిరుగుతున్నాడో అత‌డు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. అందుకే తాను దూర సందులేదు.. మెడ‌కేమో డోలా అనే సామెత గుర్తొస్తుందిప్పుడు. ర‌వితేజ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఈయ‌నే వ‌ర‌స ఫ్లాపుల్లో ఎప్పుడు హిట్ కొడ‌దామా అని చూస్తున్నాడు. మ‌ళ్లీ ఈయ‌న‌కు తోడుగా ఫ్లాప్ ద‌ర్శ‌కులు వ‌చ్చి ర‌వితేజ‌కు క‌థ‌లు చెబుతున్నారు. ఇప్పుడు వ‌క్కంతం వంశీ కూడా వ‌చ్చి ర‌వితేజ పంచ‌న చేరాడ‌ని తెలుస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు మీడియా ముందే ఉన్నాడు ఈయ‌న‌. కానీ నా పేరు సూర్య ఇచ్చిన షాక్ కు క‌నిపించ‌డం మానేసాడు.

బ‌న్నీకి ఏడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన డిజాస్ట‌ర్ ఇది. 80 కోట్ల బిజినెస్ చేసి 50 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది నా పేరు సూర్య‌. ఈ సినిమా త‌ర్వాత పూర్తిగా క‌నిపించ‌డం మానేసాడు వ‌క్కంతం వంశీ. ఆ సినిమా హిట్ అయి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది కానీ ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌ను తాను నిరూపించుకోవాల్సిన ప‌నిలో ప‌డ్డాడు వంశీ. దాంతో ఈయ‌న రెండో సినిమాపై అంద‌రి ఆస‌క్తి ఉంది. నా పేరు సూర్య ఫ‌లితం చూసిన త‌ర్వాత ఏ హీరో అయినా వంశీకి ఆఫ‌ర్ ఇచ్చే దైర్యం చేస్తాడా అనేది అస‌లు అనుమానం. క‌చ్చితంగా ఇప్ప‌ట్లో వ‌క్కంతం మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌డం క‌ష్ట‌మే.

ఈయ‌న రెండో సినిమా కోసం మ‌రోసారి పోరాటం మొద‌లుపెట్టాల్సిందే. స్టార్ హీరోల కంటే చిన్న హీరోల‌ను న‌మ్ముకుంటే ప‌ని అవుతుంద‌ని స‌ల‌హాలు కూడా వంశీకి వెళ్తున్నాయి. అయితే ఇన్ని క‌ష్టాల మ‌ధ్య కూడా ర‌వితేజ ఇత‌న్ని న‌మ్మాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్యే మాస్ రాజాను క‌లిసి వ‌క్కంతం క‌థ చెప్పాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం శీనువైట్ల‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. సంతోష్ శ్రీ‌నివాస్ తో తెరీ రీమేక్.. విఐ ఆనంద్ తో డిస్కోరాజా సినిమాలు చేస్తున్నాడు ర‌వితేజ‌. అంతా ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌తోనే. ఇక ఇప్పుడు మ‌రోసారి ఫ్లాప్ డైరెక్ట‌ర్ నే న‌మ్ముకుంటాడా అనేది చూడాలిక‌..!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *