అల్ల‌రోడి లుక్ చూసారా.. కొత్త లుక్ కేక‌..

అల్ల‌రి న‌రేష్ అని త‌లుచుకోగానే మ‌న‌కు తెలియ‌కుండానే ఓ రూపం వ‌చ్చేస్తుంది క‌ళ్ల‌ముందుకు. బ‌క్క‌గా ఉంటూ.. కాస్త కామెడీ ఫేస్ పెట్టుకుని క‌ళ్ల ముందుకు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు న‌రేష్. కానీ ఇప్పుడు ఈయ‌న రూపం మారింది. ఒక‌ప్పుడు ఎలా ఉన్నాడో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం కొత్త లుక్ లోకి వ‌చ్చేసాడు న‌రేష్. అస‌లు ఈయ‌న రూపం చూసి మ‌నం నిజంగానే న‌రేష్ ను చూస్తున్నామా లేదంటే కొత్త వ్య‌క్తి ఎవ‌రైనా ఆయ‌న‌లోకి వ‌చ్చేసారా అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

Allari-Naresh-New-Look

అయినా న‌రేష్ కెరీర్ మొద‌లై ఇన్నాళ్లైంది.. ఒక్క‌సారి కూడా లావుగా క‌నిపించ‌లేదు.. గ‌డ్డంతో బ‌య‌టికి రాలేదు. కానీ ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు ఈ అల్ల‌రోడు. ఉన్న‌ట్లుండి గెట‌ప్ పూర్తిగా మార్చేసాడు. ఇదంతా మ‌హ‌ర్షి కోస‌మ‌ని అర్థం అయిపోతుంది. అందులో మ‌హేష్ బాబు కూడా గ‌డ్డంతోనే క‌నిపిస్తున్నాడు. కారెక్ట‌ర్ గురించి చెప్ప‌డం లేదు కానీ సీరియ‌స్ రోల్ లోనే చేస్తున్నాడు న‌రేష్. మొత్తానికి మ‌హేష్, న‌రేష్ గ‌డ్డాల‌తో క‌థ‌కు బాగా గ‌ట్టి లింకే పెట్టాడు వంశీ పైడిప‌ల్లి.

ఈ మ‌ధ్య అల్ల‌రోడి సినిమాల‌న్నీ వ‌చ్చి అలా వెళ్తున్నాయి దాంతో ఇప్పుడు మ‌హ‌ర్షి త‌న కెరీర్ కు మ‌లుపులా ఉంటుంద‌ని భావిస్తున్నాడు అల్ల‌రోడు. ఈ మ‌ధ్య కొన్ని సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. అవి నిల‌బ‌డ‌లేదంటే క‌చ్చితంగా న‌రేష్ పై న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో స‌న్న‌గిల్లిన‌ట్లే. న‌రేష్ కెరీర్ ప్ర‌స్తుతం ఎటూ కాకుండా ఉంది. మొత్తానికి ఓ వైపు హీరోగా న‌టిస్తూనే మ‌రోవైపు కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిపోతున్నాడు న‌రేష్. అయితే త‌ర్వాతి సినిమాల‌కు కూడా ఇదే లుక్ కొన‌సాగిస్తాడా లేదంటే మ‌ళ్లీ మారిపోతాడా అనేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here