థ‌మ‌న్.. ఇప్ప‌టికైనా మీరు కాస్త మారాలేమో..?

ఎప్పుడు చూడు అదే పనా రా.. కొంచెం కూడా బోర్ కొట్టదా.. శ్రీమంతుడు సినిమాలో విలన్స్ ను ఉద్దేశించి మహేష్ బాబు చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు తమన్ మ్యూజిక్ ను చూసి అభిమానులు కూడా అదే అడుగుతున్నారు. ఎప్పుడు చూడు అదే మ్యూజిక్కా కొంచెం కూడా బోర్ కొట్టదా నీకు అంటూ ఆయనపై సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్. ఈయన ప్రస్తుతం మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Akhil Fans Comments on Thaman Music

ఈ చిత్ర టైటిల్ సాంగ్ క్రిస్మస్ కానుకగా విడుదలైంది. అఖిల్ బాగా డాన్స్ చేస్తాడు కాబట్టి పక్క ఫాస్ట్ బీట్ ఇచ్చాడు తమన్. అయితే ఆ ధ్యాసలో పడి తాను ప్రేమికుడు సాంగ్ మళ్ళీ రీమిక్స్ చేశాన‌నే సంగతి మర్చిపోయాడు ఈ సంగీత దర్శకుడు. పాతికేళ్ల క్రితం రెహమాన్ స్వరపరచిన ఊర్వశీ ఊర్వశీ పాటనే కాస్త మార్చి ఇప్పుడు దేవదాసు మనవడు అంటూ మిస్టర్ మజ్ను కోసం ఇచ్చాడు తమన్.

ఈ విషయం కనుక్కున్న అభిమానులు సోషల్ మీడియాలో తమన్ ను ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇచ్చిన పాటలు ఎన్ని సార్లు ఇస్తావంటూ ట్విట్టర్లో నేరుగానే ఆయనపై సెటైర్ల‌ వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ఇదే పాటలు విడుదల సమయం వరకు కచ్చితంగా హిట్ అవుతాయి చూసుకోండి అంటూ సవాల్ విసురుతున్నాడు థ‌మ‌న్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమకు ఏడాది మొదట్లో మంచి సంగీతం అందించాడు తమన్.

ఇప్పుడు అదే దర్శకుడితో పని చేస్తున్నా కూడా సేమ్ మ్యాజిక్ చేస్తారా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన మిస్టర్ మజ్ను రెండు పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి రాబోయే పాటలు ఎలా ఉంటాయి అని అక్కినేని అభిమానులు ఇప్ప‌ట్నుంచే కంగారు ప‌డుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here