ఇంకా ఎన్ని రోజులు అఖిల్..?

అస‌లే రెండు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటూ కాకుండా ఉన్నాడు అఖిల్. హ‌లో త‌ర్వాత ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ సినిమా మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్ లో పూర్తవుతుంది. తాజాగా లండ‌న్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో.

ఇప్ప‌టికే హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ అక్క‌డ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వ‌చ్చేసింది. అఖిల్ మాత్రం ఇంకా అక్క‌డే ఉన్నాడు. ముందు నుంచీ కూడా ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది అఖిల్ ప్లాన్. అయితే అది కుద‌ర‌ద‌ని తేలిపోయింది. అందుకే సినిమాను డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.

పైగా అక్కినేని వారికి డిసెంబ‌ర్ అచ్చొచ్చిన నెల కూడా. గ‌తేడాది హ‌లో సినిమా కూడా ఇదే నెల‌లో వ‌చ్చింది.. అది ఫ్లాపైనా అఖిల్ కు న‌టుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. లండ‌న్ త‌ర్వాత ఇక్క‌డ కూడా షెడ్యూల్స్ వేసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ. లండ‌న్ లో గ‌త 45 రోజులుగా జ‌రుగుతున్న నాన్ స్టాప్ షెడ్యూల్ మ‌రికొన్ని రోజులు అక్క‌డే జ‌ర‌గ‌నుంది.

అక్క‌డ షూటింగ్ పూర్తి అయిపోతే సినిమా 80 శాతం పూర్తైన‌ట్లే. ఆ త‌ర్వాత చిన్న బ్రేక్ తీసుకుని హైద‌రాబాద్ లో మ‌రో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ఇందులో అఖిల్ తో జోడీ క‌ట్టింది. ఈ సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. చూడాలి మ‌రి.. ఈ చిత్రంతోనైనా అఖిల్ హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here