పూరీ.. నా కొడుకు బంగారం..

ఇదేదో పూరీ జ‌గ‌న్నాథ్ కొత్త సినిమా టైటిల్ కాదు.. ఇప్పుడు ఆయ‌న‌కు మిగిలి ఉన్న ఆప్ష‌న్. ఇన్నాళ్లూ క‌థ‌లు సిద్ధం చేసుక‌ని బ‌య‌టి హీరోల‌ను మెప్పించాల్సి వ‌చ్చేది. వాళ్లు ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి. కానీ ఇప్పుడు ఇంట్లోనే హీరోను సిద్ధం చేసుకుంటున్నాడు పూరీ.

Akash-Puri-Upcoming-Film

ఆకాశ్ ను ఎలాగైనా స్టార్ గా నిల‌బెట్టాల‌ని క‌ల‌లు కంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ కుర్రహీరోతో చేసిన మెహ‌బూబా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే కొడుకు కెరీర్ కు గ‌ట్టి పునాది వేయాల‌ని చూస్తున్నాడు పూరీ. అది చేసే వ‌ర‌కు నిద్ర‌పోయేలా క‌నిపించ‌ట్లేదు. ప్ర‌స్తుతం మ‌రో క‌థ కొడుకు కోస‌మే రెడీ చేసాడు పూరీ. ఈ సారి పున‌ర్జ‌న్మ‌లు లాంటివి కాకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. మాస్ ఎలిమెంట్స్ పుష్క‌లంగా ఉండేలా క‌థ రాసి.. మ‌సాలా సినిమా చేయాల‌ని ఫిక్సైపోయాడు.

అయితే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న కాదు. త‌న శిష్యుల్లో అనిల్ ప‌డూరి అనే కుర్రాడికి ఈ ఆఫ‌ర్ ఇస్తున్నాడు పూరీ. ఇప్ప‌టికే హీరోయిన్ గా మిస్ ఇండియా గాయ‌త్రి భ‌ర‌ధ్వాజ్ ను ఫైన‌ల్ చేసారు. త్వ‌ర‌లోనే అనౌన్స్ మెంట్ కూడా రానుంది. పూరీ క‌నెక్ట్స్ మీదే ఈ చిత్రం రూపొంద‌నుంది. మెహ‌బూబాలో కాస్త ప్ర‌యోగం చేసి దెబ్బ‌తిన్న పూరీ.. ఈ సారి మాత్రం అలాంటివేం లేకుండా ప‌క్కా మాస్ సినిమాతోనే వ‌స్తున్నాడు.

ఓ వైపు కొడుకు కోసం క‌థ సిద్ధం చేస్తూనే.. మ‌రోవైపు రామ్ కోసం కూడా ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడు. ఇక్క‌డ మ‌రో ద‌ర్శ‌కుడు సీన్ లో ఉంటే.. అక్క‌డ త‌నే ద‌ర్శ‌కుడిగా స‌త్తా చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. మ‌రి ఈ రెండు పడ‌వ‌ల ప్ర‌యాణంలో పూరీ అడుగు ఎటు ప‌డుతుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here