న‌మ్మండి.. ఈ సారి ఆ పంది వ‌స్తుంది..

పంది రావ‌డం ఏంటి.. ఎక్క‌డికి ఎందుకు వ‌స్తుంది అనుకుంటున్నారా..? మ‌న ద‌ర్శ‌కుల‌కు ఇప్పుడు క్రియేటివిటీ పీక్స్ కు వెళ్లిపోయింది. రాజ‌మౌళి అప్పుడు ఈగ‌ను పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు రవిబాబు పందిపిల్ల‌ను పెట్టి తీసాడు. అదుగో అంటూ న‌వంబ‌ర్ 7న విడుద‌ల చేయ‌నున్నాడు ఈ చిత్రాన్ని. డిఫెరెంట్ సినిమాలు తీయ‌డంలో ర‌విబాబు ఆరితేరిపోయాడు. హీరోల‌ను న‌మ్ముకోవ‌డం కంటే కూడా జంతువుల‌ను న‌మ్ముకోవ‌డ‌మే బెట‌ర్ అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే త‌న సినిమాల‌కు యానిమ‌ల్స్ నే ప్ర‌మోష‌న్ లా వాడేస్తుంటాడు.

Adugo Movie release date locked

ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. రెండేళ్లుగా అదుగో వ‌స్తుంది అంటున్నాడే కానీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు ఈ చిత్రం. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ప‌క్కాగా ఈ సారి వ‌స్తాం అని చెబుతున్నాడు ర‌విబాబు. చెక్క కంచెకు వేలాడుతూ న‌వ్వుతూ అప్పుడు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ లో పందిపిల్ల చాలా క్యూట్ గా అంద‌ర్నీ అల‌రిస్తుంది. ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలిసారి పూర్తి స్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది.

ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది ఈ చిత్రం. సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తుండ‌గా.. ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యాన‌ర్ లో ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదుగో అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను.. ముఖ్యంగా పిల్ల‌ల‌ను బాగా ఆక‌ట్టుకునే కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. అందుకే ఈ చిత్రాన్ని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం బంటి పేరుతో విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here