అందాల‌తో హ‌లో చెబుతున్న అదితిరావ్.

అదితిరావ్ హైద్రీ అంటే ఇన్నాళ్లూ బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా సౌత్ హీరోయిన్ అయిపోతుంది. బేసిక్ గా తెలుగు అమ్మాయే అయినా ముంబైలోనే పుట్టి పెర‌గ‌డంతో అక్క‌డి అల‌వాట్లే బాగా వ‌చ్చేసాయి. పైగా బాలీవుడ్ లో ఎలాగూ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఇప్పుడు తెలుగులో కాన్స‌ట్రేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. స‌మ్మోహ‌నంగా ఆక‌ర్షిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయే అన్ని ల‌క్ష‌ణాలు త‌న‌లో ఉన్నాయ‌ని నిరూపించుకుంది ఈ భామ.

 

ఇన్నాళ్లూ ఈ పేరుకు తెలుగులో త‌క్కువ గుర్తింపు ఉంది కానీ త్వ‌ర‌లోనే ఈ భామ ఇమేజ్ అలా పెరిగిపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది.
పైగా ఇలా మ‌ధ్యమ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్ల‌తో రెచ్చిపోతుంది అదితి. అంతేకాదు స‌మ్మోహనంలో సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది అదితి. పైగా ఇప్పుడు సినిమాలో ఈమె వాయిస్ కు కూడా మంచి మార్కులే ప‌డ‌టంతో అదితిపై క‌న్నేసి ఉంచుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లంతా.

కేవ‌లం న‌ట‌నే కాదు.. అందాల ఆర‌బోత‌లో కూడా అమ్మాయిగారికి అస్స‌లు అడ్డంకులు లేవు. ఇక న‌వాబ్ లో కూడా చిన్న పాత్ర‌లో మెరిసింది అదితి. ఇప్పుడు హ‌లో మ్యాగ‌జైన్ కోసం అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టిస్తుంది అదితి. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ తెలుగు ఇండ‌స్ట్రీలో ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here