అదుగో పందిపిల్ల పాటొచ్చింది.

అదుగో.. చూడండి పందిపిల్ల ఎంత చ‌క్క‌గా డాన్స్ చేస్తుందో క‌దా..? అప్పుడు హీరోల డాన్సులు ఈగ చేసిన‌ట్లు ఇప్పుడు పందిపిల్ల కూడా చేస్తుంది. అలా చేయిస్తున్నాడు ర‌విబాబు. డిఫెరెంట్ సినిమాలు తీయ‌డంలో ఈయ‌న‌ ఆరితేరిపోయాడు. హీరోల‌ను న‌మ్ముకోవ‌డం మానేసి జంతువుల‌ను న‌మ్ముకోవ‌డ‌మే బెట‌ర్ అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే త‌న సినిమాల‌కు యానిమ‌ల్స్ నే ప్ర‌మోష‌న్ లా వాడేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. అయితే ఈ సారి ఏకంగా ఓ పందిపిల్ల‌ను ప్ర‌ధాన‌పాత్ర‌లో పెట్టి సినిమా చేస్తున్నాడు. దానిపేరు అదుగో. రెండేళ్లుగా అదుగో వ‌స్తుంది అంటున్నాడే కానీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు ఈ చిత్రం.ఇప్పుడు ఈ చిత్రంలోని ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌లైంది.

ర‌విబాబు ఆస్థాన నాయిక పూర్ణ ఈ పాట‌లో పందిపిల్ల‌తో క‌లిసి స్టెప్పులేసింది. అదుగో అదుగో అంటూ సాగే ఈ పాట‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. పందిపిల్ల డాన్సుల‌తో ప‌ర‌వ‌శించిపోతున్నారు ప్రేక్ష‌కులు. ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది.ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ద‌స‌రా సెల‌వుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది అదుగో చిత్రం. సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తుండ‌గా.. ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యాన‌ర్ లో ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదుగో అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను.. ముఖ్యంగా పిల్ల‌ల‌ను బాగా ఆక‌ట్టుకునే కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. అందుకే ఈ చిత్రాన్ని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం బంటి పేరుతో విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *