డ్ర‌గ్స్ కేసులో బుక్కైన హీరోయిన్..

డ్రగ్స్ అంటేనే ఇప్పుడు వ‌ణుకు వ‌చ్చేస్తుంది. ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీని కుదిపేసిన కేస్ ఇది. ఒక్క‌ర్ని ప‌ట్టుకుంటే మొత్తం ఇండ‌స్ట్రీ అంతా బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఓ హీరోయిన్ డ్ర‌గ్స్ అమ్ముతూ అడ్డంగా దొరికిపోయింది. క‌నీసం మాట‌లు కూడా లేకుండా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అంత అడ్డంగా చేతిలో డ్ర‌గ్స్ తో దొరికిపోయిన ఆ హీరోయిన్ మ‌న ద‌గ్గ‌ర మాత్రం కాదు. అదొక్క‌టే ఇప్పుడు ఇక్క‌డ ఊపిరి పీల్చుకునే విష‌యం. ఎక్క‌డో కేర‌ళ‌లో సీరియ‌ల్స్ లో పాపుల‌ర్ అయిన న‌టి అశ్వతి బాబు ఈ కేస్ లో అరెస్ట్ అయింది. త‌న కార్ లో డ్రైవ‌ర్ తో పాటు డ్ర‌గ్స్ అమ్ముతూ ప‌ట్టుబ‌డింది ఈ భామ‌. అక్క‌డే ఉన్నందుకు డ్రైవ‌ర్ కూడా బుక్ అయ్యాడు ఇప్పుడు. ఇప్పుడు ఈ కేస్ పై కేర‌ళ పోలీసులు ఆరా తీస్తున్నారు.

aswathy babu arrested in drugs case
aswathy babu arrested in drugs case

మ‌ళ‌యాల సీరియ‌ల్స్ లో చాలా పాపుర‌ల్ ఈ అశ్వ‌తి బాబు. అక్క‌డ బాగానే సంపాదిస్తున్నా కూడా మ‌ళ్లీ ఈజీ మ‌నీ కావాల‌నే ఆశ‌తోనే ఈ రొంపిలోకి దిగింది. ఇప్పుడు అడ్డంగా బుక్కై క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లే ప‌రిస్థితికి వ‌చ్చింది. దొరికితే దొంగ లేక‌పోతే దొరేగా అన్న‌ట్లు డ్ర‌గ్స్ వ్యాపారం చేసి బుక్ అయిపోయింది. ఈమెకు సాయం చేయ‌డానికి కూడా ఇప్పుడు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఎవ‌రైనా వ‌స్తే ఎక్క‌డ త‌మ‌కు ఆ ముఠాతో సంబంధం ఉందేమో అనుకుంటారేమో అని అశ్వ‌తిని అలాగే వ‌దిలేసారు. ఆమె వెనకాల డ్రగ్స్ మాఫియా ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలుగులో కూడా చిన్న‌గానే మొద‌లై ఆ త‌ర్వాత సంచ‌ల‌నం అయింది డ్ర‌గ్స్ కేస్. మ‌రి ఇప్పుడు కేర‌ళలో ఏం జ‌ర‌గ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here