బాల‌య్య చ‌చ్చిపోయాడంట‌.. గూగుల్ చెప్పింది..

ఏం మాట్లాడుతున్నారు.. పిచ్చి గానీ ప‌ట్టిందా.. బాల‌య్య చ‌చ్చిపోవ‌డం ఏంటి..? ఫ‌్యాన్స్ కు తెలిస్తే అడ్ర‌స్ తెలుసుకుని వ‌చ్చి మ‌రీ కొడ‌తారు.. పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనుకుంటున్నారా..? క‌రెక్టే.. ఇలాంటి క‌మెంట్ చేసిన‌పుడు త‌న్నడ‌మే క‌రెక్ట్.. కానీ ఇది చేసింది ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు.

అంద‌రికీ క్లారిటీ ఇచ్చే గూగుల్ త‌ల్లే ఇప్పుడు బాల‌య్య విష‌యంలో క‌న్ఫ్యూజ్ అయింది. ఎవ‌రైనా కొడితే వెళ్లి రాముడికి చెప్పాలంటారు.. ఆ రాముడే బాణం వేస్తే ఎవ‌రికి చెప్పుకోవాల‌ని ఓ క‌థ ఉన్న‌ట్లు ఇప్పుడు గూగుల్ త‌ల్లే త‌ప్పు చేస్తే ప‌రిస్థితి ఏంటి అంటున్నారు అభిమానులు. నంద‌మూరి బాల‌కృష్ణ‌ను చ‌నిపోయిన‌ట్లు చూపించింది వీకిపీడియా. దీనిపై ఫ్యాన్స్ కూడా సీరియ‌స్ అయ్యారు.. బ‌తికి ఉన్న మ‌నిషిని చ‌చ్చిపోయాడ‌ని ఎలా చూపిస్తార‌ని.. తెలివి ఉందా లేదా అంటూ సీరియ‌స్ అవుతున్నారు అభిమానులు.

అస‌లు విష‌యం ఏంటంటే క‌న్న‌డ‌లో టిఎన్ బాల‌కృష్ణ అనే ఓ న‌టుడు ఉన్నాడు.. ఆయ‌న గురించి మ‌న‌లో ఎవ‌రికీ తెలియ‌దు కూడా. ఆయ‌న 1913లో పుట్టి 1995లో క‌న్ను మూసాడు. ఆయ‌న ఫోటో స్థానంలో బాల‌య్య ఫోటో పెట్టి గూగుల్ లో అప్ లోడ్ చేసారు. దాంతో వీకిపీడియాలో చాలా సేపటి వ‌ర‌కు మ‌న బాల‌య్య ఫోటోనే క‌నిపించింది. ఆయ‌న 1995లోనే చ‌నిపోయారంటూ వీకిపీడియాలో పోస్ట్ చేసారు. దాంతో ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. సోష‌ల్ మీడియాలో దారుణంగా క‌మెంట్ చేసే స‌రికి వెంట‌నే తేరుకున్న గూగుల్.. మ‌ళ్లీ ఫోటోను మార్చేసారు. ఏదేమైనా సెలెబ్రెటీస్ విష‌యంలోనే కాదు.. బ‌తికున్న మ‌నుషుల‌పై ఇలాంటి తిక్క ప‌నులు చేస్తే లేనిపోని త‌ల‌నొప్పులు క‌చ్చితంగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందులో బాల‌య్య ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మ‌టాషే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *