31 నైట్ సెలెబ్రేషన్స్ 1 గంట వరకే:సీపీ సందీప్ శాండిల్య

న్యూఇయర్ వస్తుంది అంటే అందరు న్యూఇయర్ సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉంటె పాపం పోలీసులు మాత్రం ఎక్కడ ఏ తప్పు జరగకుండా డ్యూటీ చేస్తుంటారు. అయితే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లలో ఇప్పటికే ఉన్న రూల్స్ కి తోడు మరిన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తుంటారు సిటీ పోలీసులు. అలాగే ఈ సంవత్సరం కుడా కొత్త రూల్స్ కొన్ని జేర్చారు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య. ఈనెల 31వ తేదీన సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తామని తెలిపారు.

31 నైట్ సెలెబ్రేషన్స్ ఒంటి గంట వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అంతేగాక డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తామని, మొత్తం 120 టీమ్‌లు బ్రీత్ అనలైజర్లతో సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే స్పీడ్ లిమిట్ తప్పనిసరి అని, అతి వేగంతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. అన్ని హోటల్స్, పబ్స్, రిసార్ట్‌లలో భద్రత కట్టుదిట్టం చేశామని, డీజేలకు అనుమతి తప్పనిసరి అని సీపీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here