బండ్ల గ‌ణేష్ చ‌చ్చిపోతాడంట‌.. ఆపండ్రా బాబూ..

అదేంటో తెలియ‌దు కానీ బండ్ల గ‌ణేష్ ఎక్క‌డుంటే అక్క‌డ న‌వ్వులే ఉంటాయి. ఆయ‌న అడుగు పెడితే కామెడీ పండుతుంది. సినిమాల్లో కూడా కొన్ని రోజులు న‌వ్వించిన ఈయ‌న ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. ఇక్క‌డ కూడా సినిమాల్లో మాదిరే కామెడీ చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌జ‌న చేసి చేసి జ‌న‌సేన‌లో చేరుతాడేమో అనుకుంటే.. చివ‌రికి వ‌చ్చి కాంగ్రెస్ లో చేరిపోయాడు బండ్ల‌. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ ఎన్నిక‌ల కామెడీని త‌న భుజాల‌పై వేసుకున్నాడు ఈ క‌మెడియ‌న్ క‌మ్ పొలిటిక‌ల్ లీడ‌ర్.

30 years industry Hillarious comments on bandla ganesh

తెలంగాణ‌లో కానీ కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసాడు. ఈయ‌న చేసిన వ్యాఖ్యల‌ను ఎవ‌రూ సీరియ‌స్ గా తీసుకోలేదు పైగా బండ్ల భ‌లే కామెడీ చేస్తున్నాడు క‌దా అంటూ న‌వ్వుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఇదే ఇష్యూపై మ‌రో సీనియ‌ర్ క‌మెడియ‌న్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ సెటైర్లు వేసాడు. బండ్ల గ‌ణేష్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని..

అయితే తెలంగాణ‌లో కాంగ్రెస్ రాక‌పోతే ఆయ‌న సుసైడ్ చేసుకుంటాన‌ని చెప్ప‌డం భ‌యంగా ఉంద‌ని సెటైర్లు వేసాడు. పైగా ఆయ‌న‌కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో కూడా ఫోటో దిగేంత స‌త్తా ఉంద‌ని.. త‌న‌కు లేద‌ని.. మ‌రి అలాంటి స‌త్తా ఉన్న నాయ‌కున్ని మ‌నం కోల్పోకూడ‌దు క‌దా అని చెప్పాడు పృథ్వీ. ఎందుకంటే రేపు తెలంగాణ‌లో రాబోయేది కేసీఆరే అని జోస్యం చెప్పాడు ఈ క‌మెడియ‌న్. ఇక్క‌డ తెలంగాణ అభివృద్దికి పాటుప‌డుతుంది కేసీఆర్ ఒక్క‌డే అని..

ప్ర‌జా కూటమికి కానీ ఓటేస్తే క‌చ్చితంగా న‌ష్టం త‌ప్ప‌ద‌ని చెప్పాడు ఈయ‌న‌. అందుకే బండ్ల గ‌ణేష్ రేపు ఎన్నిక‌ల త‌ర్వాత ఏం చేసుకోకుండా కాప‌లాగా ఉండాల‌ని కోరుకున్నాడు పృథ్వీ. మొత్తానికి సినిమాల్లోనే కాదు.. బ‌య‌ట కూడా మ‌న క‌మెడియ‌న్లు బాగానే న‌వ్విస్తున్నారు ఈ ఎన్నిక‌ల పుణ్య‌మా అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here