2.0 కలెక్ష‌న్స్.. రికార్డుల వేట షురూ..

ఇండియ‌న్ మోస్ట్ అవైటెడ్ మూవీకి రికార్డులు వ‌స్తే ఆశ్చ‌ర్యం ఏముంది.. రాక‌పోతే క‌దా ఆశ్చ‌ర్య‌ప‌డాలి..? ఇప్పుడు 2.0 విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈ చిత్రం తొలిరోజే చాలా రికార్డుల‌కు బ్రేక్ చెప్పింది. అయితే బాహుబ‌లి 2 మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ రికార్డ్ జోలికి వెళ్ల‌లేదు 2.0. క‌నీసం దరిదాపుల్లోకి కూడా రాలేదు.

2point0

బాహుబ‌లి 2 తొలిరోజే ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్.. 121 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కానీ 2.0 మాత్రం 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది కానీ షేర్ కూడా 100 కోట్లు రాలేదు. దాంతో ఇప్పుడు బ‌య్య‌ర్ల గుండెల్లో భ‌యం మొద‌లైంది. అయితే ఇంకా టైమ్ ఉంది కాబ‌ట్టి రానురాను లాంగ్ ర‌న్ లో పెట్టిన డ‌బ్బులు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు వాళ్లు. త‌మిళ‌నాట సినిమాపై ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు.

అక్క‌డ సినిమా క‌చ్చితంగా ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం. అయితే తెలుగు, క‌న్న‌డ‌, హిందీల్లో అంతా వెన‌క్కి వ‌స్తుందా అనే అనుమానాలు ఇప్పుడు మొద‌ల‌య్యాయి. సినిమా అద్భుతంగా ఉంది కానీ కంటెంట్ లో మాత్రం చాలా వీక్ ఉంది. అందుకే బాగుంది అని చెప్పిన వాళ్ల కంటే యావ‌రేజ్ అని చెప్పిన ప్రేక్ష‌కులే ఎక్కువ‌గా ఉన్నారు.

ఓసారి చూడొచ్చు.. అది కూడా 3డిలో అయితే పండ‌గ అంటున్నారే కానీ క‌చ్చితంగా చూడాల్సిన సినిమా అని మాత్రం ఎవ‌రూ చెప్ప‌డం లేదు. దాంతో 2.0 భవిష్య‌త్తు ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్రం 500 కోట్లు వ‌సూలు చేస్తే కానీ సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకోదు. మ‌రి శంక‌ర్ క‌ష్టానికి.. ర‌జినీ ఇమేజ్ కు.. అక్ష‌య్ స్టామినాకు ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు స‌మాధానం చెబుతుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here