అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు గురూ..

బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ కు 150 కోట్ల మార్కెట్ ఉంది. ఆయ‌న సినిమాలు ఎలా ఉన్నా కూడా క‌నీసం 100 కోట్లు వ‌సూలు చేస్తుంటాయి. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు 2.0 సినిమాను 80 కోట్ల‌కు అమ్మారు అక్క‌డ‌. పైగా క‌ర‌ణ్ జోహార్ ఉన్నాడు.. అన్నింటికీ మించి ర‌జినీకాంత్, శంక‌ర్ లాంటి క్రేజీ కాంబినేష‌న్ ఉంది. అయితే ఎంత‌మంది ఉన్నా కూడా అక్క‌డ అక్ష‌య్ కుమార్ అనే పేరుకు మార్కెట్ ఎక్కువ‌గా ఉంది అది ఒప్పుకోవాల్సిన స‌త్యం.

2point0-Box-Office-Collection-Day2

ఇప్పుడు ఇదే ప‌ని చేయ‌డం లేదు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ 2.0 చూసిన త‌ర్వాత ఫిదా అవుతారేమో అనుకుంటే హ‌ర్ట్ అవుతున్నారు. త‌మ హీరోను మ‌రీ త‌క్కువ పాత్ర‌లో చూపించార‌ని.. అస‌లు అక్క‌డ ఆయ‌న ఎంత‌సేపు స్క్రీన్ పై క‌నిపించారు.. ఏం ఉంది ఆ పాత్ర‌లో అంటూ ఫీల్ అవుతున్నారు వాళ్లు. 2.0లో ఉన్న కొద్దోగొప్పో క‌థ‌లో అక్ష‌య్ కుమార్ అంతా తీసుకున్నాడు. కానీ ఆయ‌న మొత్తం 30 నిమిషాలు కూడా సినిమాలో క‌నిపించడు. ఇదే ఇప్పుడు అభిమానుల‌కు షాక్ అయ్యేలా చేసింది. అక్క‌డ తొలిరోజు కేవ‌లం 12 కోట్ల షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. ఇంకో 60 కోట్లు వ‌స్తే కానీ అక్క‌డ సేఫ్ కాదు ఈ చిత్రం. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 2.0 కు అన్ని వ‌సూళ్లు వ‌స్తాయా అనేది ఆస‌క్తిక‌ర‌మే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here