అక్టోబ‌ర్ 26న ముద్దుల వ‌ర్షం.. 24 కిస్సెస్ సెన్సార్ పూర్తి..

అప్ప‌ట్లో వెంక‌టేశ్ ముద్దుల ప్రియుడు అయిన‌ట్లు ఇప్పుడు హెబ్బాప‌టేల్ ముద్దుల ప్రియురాలు అయిపోయింది. దానికి కార‌ణం 24 కిస్సెస్. అక్ష‌రాలా 24 ముద్దులు అని అర్థం. ఇందులో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ కుమారి. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత హెబ్బాకు స‌రైన స‌క్సెస్ రాలేదు.

24 kisses hebah patel

 

దాంతో హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ భామ‌. దానికితోడు అమ్మాయి ఫుల్ గా బ‌రువు పెరిగిపోయి చూడ‌లేని విధంగా మారిపోయింది. ఇలాంటి టైమ్ లో 24 కిస్సెస్ అంటూ వ‌స్తుంది ఈ భామ‌. ఈ సినిమాలో కుమారిని మించి గ్లామ‌ర్ పంచ‌డానికి వ‌స్తుంది హెబ్బా. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్ అనే సినిమాలో న‌టిస్తుంది.

టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రంలో 24 ముద్దు సీన్లు ఉంటాయి. ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ రొమాన్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమా ఎలా ఉండ‌బోతుందో క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అనుకున్న‌ట్లుగానే ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ట్రైల‌ర్ లోనే ముద్దుల వ‌ర్షం కురిపించింది హెబ్బా. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రం గురించి హెబ్బా చెబుతూ.. కుమారి 21 ఎఫ్ తరహాలోనే 24 కిసెస్ లోనూ త‌న‌ది బోల్డ్ కారెక్ట‌ర్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ స్పైసీ కారెక్ట‌ర్ అయినా హెబ్బాను ఒడ్డున ప‌డేస్తుందో లేదో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here