24 ముద్దులు పెట్టిన ఫ‌లితం శూన్య‌మేగా హెబ్బా..?

ఒక‌టి రెండు మూడు అంటూ అలా లెక్క‌పెట్టి మ‌రి 24 ముద్దులు ఆన్ స్క్రీన్ పైనే ఇచ్చింది హెబ్బాప‌టేల్. మ‌ళ్లీ ప్రాక్టీస్ లో ఇచ్చిన ముద్దుల‌కు క‌నీసం కౌంట్ కూడా లేదేమో..? అంత‌గా క‌ష్ట‌ప‌డినా కూడా ఇప్పుడు ఫ‌లితం మాత్రం శూన్యం. ఇంత‌కుముందు ముద్దుల ప్రియుడు అంటే తెలుగులో వెంక‌టేష్ పేరు గుర్తొస్తుంది. ఆయ‌నే అప్ప‌ట్లో ముద్దుల ప్రియుడు అనిపించాడు. ఇప్పుడు ఆ బిరుదు విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌రే ఉంది. ప్ర‌తీ సినిమాలోనూ ముద్దుల‌తో ముంచెత్తుతున్నాడు కాబ‌ట్టి. ఇప్పుడు ముద్దుల ప్రియురాలు కూడా వ‌చ్చేసింది.

24 kisses movie Disaster

త‌నే హెబ్బాప‌టేల్.. 24 కిస్సెస్ సినిమాలో అక్ష‌రాలా 24 ముద్దులు పెట్టింది. కానీ సినిమాకు మాత్రం దారుణ‌మైన టాక్ వ‌చ్చింది. తొలిరోజే డిజాస్ట‌ర్ అని తేలిపోయింది. కుమారి 21 ఎఫ్ త‌ర్వాత‌ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో మరో హిట్ అందుకుంది ఈ భామ‌. కానీ ఆ త‌ర్వాత హెబ్బాకు స‌రైన స‌క్సెస్ రాలేదు.

దాంతో హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ భామ‌. దానికితోడు అమ్మాయి ఫుల్ గా బ‌రువు పెరిగిపోయి చూడ‌లేని విధంగా మారిపోయింది. ఇలాంటి టైమ్ లో 24 కిస్సెస్ అంటూ వ‌చ్చింది. కానీ ఈ చిత్రంలో ముద్దులున్నాయి కానీ కంటెంట్ మాత్రం లేదు. దాంతో మ‌రోసారి హెబ్బాకు నిరాశ త‌ప్ప‌లేదు. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌రిచింది.

క‌నీసం ఫుల్ సినిమా చూడ్డానికి కూడా ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించ‌డం లేదంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ రొమాన్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్. కానీ వాళ్లు బాగున్నా క‌థ ఆక‌ట్టుకోలేదు. ఆ 24 ముద్దులకు ఉండే లింక్ ఏమిటనేది సినిమాలో చూపించాడు ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్. అయితే అది ఆస‌క్తిక‌రంగా మాత్రం లేదు. కుమారి 21 ఎఫ్ తరహాలోనే 24 కిసెస్ తో కూడా హిట్ కొట్టాల‌ని క‌ల‌లు క‌న్న హెబ్బా ఆశ‌ల‌కు గండి కొట్టేసింది 24 కిస్సెస్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here