2.0.. ఓవ‌ర్సీస్ డిజాస్ట‌ర్ అయ్యేట్లుందిగా..

అనుకున్న‌దొక్క‌టి.. అయిన‌దొక్క‌టి.. ఇప్పుడు ఈ పాట 2.0 కు ప‌క్కా సూట్ అవుతుంది. వ‌చ్చీ రాగానే ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకుంటుందేమో అనుకుంటే.. అట్టే కూర్చుండిపోయాడు ర‌జినీకాంత్. ఎంత ట్రై చేసినా చిట్టి క‌ద‌ల‌డం లేదు.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈయ‌న ర‌చ్చ చూసే అవ‌కాశం ఇప్పుడు అభిమానుల‌కు క‌ల‌గ‌డం లేదు.
2point0-us-collections
ఏదో అలా యావ‌రేజ్ క‌లెక్ష‌న్ల‌తో బండి న‌డిపిస్తుంది 2.0. ప‌డిపోతున్న సినిమాను పైకి లేప‌డానికి అద్భుత‌మైన విజువ‌ల్స్ ఉన్న టీజ‌ర్స్ కూడా విడుదల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇండియాలో ఓకే కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం 2.0 దారుణ‌మైన ప‌రాజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు 2.2 మిలియ‌న్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ లో 2.0 సేఫ్ అవ్వాలంటే రావాల్సిన మొత్తం 7 మిలియ‌న్.
అప్ప‌ట్లో క‌బాలి ప్రీమియ‌ర్ షోస్ నుంచే 2.32 మిలియ‌న్ వ‌సూలు చేసింది. అయితే ఇప్పుడు క‌నీసం 2.0 ఒకేఒక్క మిలియ‌న్ కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. శంక‌ర్, ర‌జినీకాంత్ లాంటి కాంబినేష‌న్ కూడా వ‌ర్క‌వుట్ కాక‌పోతే ఇంక బ‌య్య‌ర్లు మాత్రం ఏం చేస్తారు ఖాళీగా చూడ‌టం త‌ప్పించి. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఓవ‌ర్సీస్ లో వీకెండ్ ముగిసింది అంటూ క‌నీసం ప‌ట్టించుకోరు.. ఆ లెక్క‌న 2.0కు ఊహించ‌ని న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇదే కానీ జ‌రిగితే డ్రీమ్ ప్రాజెక్ట్ కాస్తా డెడ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇక్క‌డ కూడా ఊహించిన వ‌సూళ్లేం రావ‌ట్లేదు. మూడు రోజుల్లో కేవ‌లం 100 కోట్లు షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. ఇది ర‌జినీకాంత్, శంక‌ర్ రేంజ్ కు చాలా త‌క్కువ‌. మ‌రి చూడాలిక‌.. 2.0 చివ‌రి ప్ర‌యాణం ఎక్క‌డ ఆగ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here