రివ్యూ: 2.0

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

2.0.. మేకింగ్ అద‌ర్స్.. కంటెంట్ వీక్..
Rating: 3.25/5

www.teluguodu.com

‘2.0’ – అద్భుత విజువల్ థ్రిల్లర్
Rating: 3.75/5

www.123telugu.com

శంకర్‌ - 2.0!
Rating: 3.25/5

www.greatandhra.com

రివ్యూ       : 2.0
న‌టీన‌టులు : ర‌జినీకాంత్, అమీజాక్స‌న్,అక్ష‌య్ కుమార్,ఆదిల్ హుస్సేన్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు : శ‌ంక‌ర్
నిర్మాత‌     : సుభాష్క‌ర‌న్

ఇండియ‌న్ సినిమా అంతా 2.0 కోసం చూసింది. ఇప్పుడు సినిమా వ‌చ్చేసింది. మ‌రి అది ఎలా ఉంది.. శంక‌ర్ మ‌రోసారి అద్భుతం చేసాడా.. లేదంటే ఐ మ‌త్తులోనే ఉన్నాడా…? 2.0 అంచ‌నాలు ఎంతవ‌ర‌కు అందుకుంది..?

క‌థ‌:
వ‌శీక‌ర‌ణ్(ర‌జినీకాంత్) సైంటిస్ట్. చిట్టిని కోర్ట్ బ్యాన్ చేసిన త‌ర్వాత మ‌రో రోబో వెన్నెల‌(అమీజాక్సన్) ను సిద్ధం చేస్తాడు. దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అదే స‌మ‌యంలో సిటీలో అన్ని ఫోన్లు ఒకేసారి మాయం అవుతుంటాయి. దాని వెన‌క ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్) ఉన్నాడ‌ని తెలుసుకుంటాడు వ‌శీక‌ర‌ణ్. అప్పుడు మ‌ళ్లీ చిట్టిని తీసుకొస్తారు మ‌రో దారి లేక‌. దాంతో అప్ప‌ట్నుంచీ ప‌క్షిరాజు, చిట్టి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంది. అది ఎలా ముగిసింది.. అస‌లు ప‌క్షిరాజు అలా ఎందుకు మారిపోయాడు అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
అద్భుతాన్ని చూస్తున్నప్పుడు ఆరాలు తీయకూడదు.. ఆస్వాదించాలి అంతే.. 2.0 చూస్తున్నంత సేపు నాకు అలాగే అనిపించింది. రోబోలు.. సైన్స్.. ఇవన్నీ మనకు కొత్తగా అనిపించినా కూడా శంకర్ ఆకట్టుకునేలా తీసాడు.. విజువల్ వండర్ అనే పదానికి మరోసారి నిదర్శనం చూపించాడు ఈ దర్శకుడు. 8 ఏళ్ల కింద రోబోతో ఇండియన్ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన ఈయన.. ఇప్పుడు మళ్లీ ఆ పవర్ చూపించారు.. బడ్జెట్ ఇస్తే హాలీవుడ్ కి తక్కువ కాదని నిరూపించారు శంకర్. అయితే విజువల్ ఎఫెక్ట్స్ ని 100 శాతం వాడుకున్న శంకర్.. కథని పట్టించుకోలేదు.. ఎంతసేపూ విఎఫ్ఎక్స్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు.. కథని వదిలేసాడు.

శంకర్ సినిమా అంటే గతంలో విజువల్ తో పాటే బలమైన కథ ఉండేది. కానీ ఇప్పుడు ఈయన కేవలం విజువల్ ని మాత్రమే నమ్ముకోవడం ఆశ్చర్యం.. 2.0 లో పాత శంకర్ కనబడలేదు కానీ కొత్త ఇండియన్ సినిమా కనబడింది. దానికి కథ కూడా బలంగా ఉండుంటే చరిత్రలో నిలిచిపోయుండేది 2.0. కానీ ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా బాగుంది అని చెప్పలేం.. కానీ కచ్చితంగా కొత్త అనుభవం ఇది. పక్షులను కాపాడటం.. రేడియేషన్ సమస్యలు ఎప్పుడూ ఉండేవే.. ఇదే 2.0 కథ.. అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి కాస్త గాడి తప్పింది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది.. కానీ ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగింది..

ఇంటర్వెల్ సూపర్.. సెకండ్ హాఫ్ పూర్తిగా విజువల్ మాయాజాలం తప్ప కథ లేదు.. క్లైమాక్స్ అయితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. మూడేళ్ళ కష్టం కనిపించింది కానీ కథ కూడా బలంగా ఉంటే అద్భుతాలు సృష్టించేది 2.0.. రజినీకాంత్ గురించి ఏం చెప్పాలి.. ఆయన మాయ అంతే.. అలా చూడాలి. అక్షయ్ కుమార్ చాలా బాగా నటించాడు.. అమీ జాక్సన్ అందంగా ఉంది. ఓవరాల్ గా 2.0 అంచనాలు లేకుండా వెళ్తే విజువల్ ని ఎంజాయ్ చేయొచ్చు..

న‌టీన‌టులు:
ర‌జినీకాంత్ అద్భుతం. ఆయ‌న స్క్రీన్ పై క‌నిపించిన ప్ర‌తీసారి మాయే. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. చిట్టి, వ‌శీ, బుల్లి రోబోగా అద‌ర‌గొట్టాడు ర‌జినీకాంత్. మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. ఇక అక్ష‌య్ కుమార్ కూడా ప‌క్షిరాజుగా మాయ చేసాడు. చాలా బాగా న‌టించాడు. క‌థ‌తో ప్రాణం ఆయ‌నే. అమీజాక్స‌న్ చాలా అందంగా ఉంది. నిజంగానే రోబోలా ముద్దుగా అనిపించింది. మిగిలిన వాళ్లంతా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేనివాళ్లే..

టెక్నిక‌ల్ టీం:
టెక్నిక‌ల్ టీంలో అంద‌రికంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఏఆర్ రెహ‌మాన్. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ కేవ‌లం సినిమాటోగ్ర‌ఫీతో హైలైట్ అయ్యాయి. ఇక శంక‌ర్ అయితే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టాడు. అయితే క‌థ‌ను ప‌క్క‌న‌బెట్టి పూర్తిగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మీదే అంతా న‌డిపించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాల్లో చూడ‌ని విజువ‌ల్స్ ఉన్నాయి కాబ‌ట్టి 2.0 రిచ్ గా అనిపించింది కానీ క‌థ ప‌రంగా చూసుకుంటే మాత్రం కాదు. ద‌ర్శ‌కుడిగా టెక్నిక‌ల్ గా టాప్ లో ఉన్నా కంటెంట్ లో మాత్రం వెన‌క‌బ‌డిపోయాడు.

చివ‌ర‌గా:
2.0.. మేకింగ్ అద‌ర్స్.. కంటెంట్ వీక్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here