2.0 బ‌య్య‌ర్ల‌కు వ‌ణుకు మొద‌లైంది..

ఇన్నాళ్ళూ ర‌జినీకాంత్ సినిమా అంటే హాయిగా ఉండేవాళ్లు బ‌య్య‌ర్లు. ఎలా ఉన్నా డ‌బ్బులు వ‌చ్చేస్తాయిలే.. అక్క‌డున్న‌ది సూప‌ర్ స్టార్ క‌దా.. ఆ బొమ్మ‌కు కోట్లు వ‌చ్చిప‌డ‌తాయి అనుకునేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా సీన్ రివ‌ర్స్ అవుతూ వ‌స్తుంది. తెలుగులో అయితే ఎప్పుడో అయింది..

ఇప్పుడు విచిత్రంగా త‌మిళ‌నాట కూడా అయిపోయింది. కాలా సినిమా అన్ని భాష‌ల్లోనూ డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో ర‌జినీ ఇమేజ్ త‌గ్గిపోయింద‌నే విమ‌ర్శలైతే బాగానే వ‌స్తున్నాయి. పైగా తెలుగులో ర‌జినీ మార్కెట్ దారుణంగా ప‌డిపోయింది. ఇక్క‌డ కాలా క‌నీసం 10 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేదంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాలా ప్ర‌భావం 2.0పై ప‌డుతుంది. శంక‌ర్ ఉన్నాడు.. అక్ష‌య్ ఉన్నాడు.. ర‌జినీ ఉన్నాడ‌ని ఇన్ని రోజులు ధైర్యంగా క‌నిపించిన బ‌య్య‌ర్ల‌లో ఇప్పుడు వ‌ణుకు మొద‌లైంది.

ఇంతమంది ఉన్నా సినిమాలో ద‌మ్ముందా అని ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు. ఎందుకంటే ఈ చిత్రాన్ని 400 కోట్ల‌తో తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. పైగా రేట్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో రోబో 2 కోసం ఏకంగా 80 కోట్ల‌కు పైగానే పెట్టేసారు. అస‌లు మ‌న సినిమాల‌కే ఇంత రావ‌డం ఇప్పుడు గ‌గ‌నంగా మారుతుంది. అప్పుడు ర‌జినీ మంచి రైజింగ్ లో ఉన్న‌పుడు ఏడాది కిందే 2.0 రేట్ అమ్మేసారు.

కానీ ఇప్పుడు ప‌రిస్థితుల‌న్నీ చూసిన త‌ర్వాత బ‌య్య‌ర్ల‌లో వ‌ణుకు కాదు.. ఇంకేదో మొద‌లైపోయింది. అస‌లు ఎంత అద్భుతం చేస్తే 2.0కు ఇన్ని కోట్లు వ‌స్తాయ‌ని కంగారు ప‌డు తున్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఇదే స‌గం టెన్ష‌న్ అంటే ఇప్పుడు సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో అనే టెన్ష‌న్ మ‌రోవైపు ఉంది. 2018 లో అయితే క‌చ్చితంగా ఈ చిత్రం రాదు. మ‌రి వ‌చ్చే ఏడాది ఎప్పుడొస్తుందో.. ఏం చేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here