2 మిలియ‌న్ క్ల‌బ్ లో గీత‌గోవిందం..

లాంఛ‌నం పూర్త‌యింది. గీత‌గోవిందం ఓవ‌ర్సీస్ లో 2 మిలియ‌న్ క్ల‌బ్ లో చేరిపోయింది. చిన్న సినిమాగా మొద‌లై.. ఈ సినిమా చేస్తోన్న ర‌చ్చ‌.. సృష్టిస్తున్న సంచ‌ల‌నాలు చూస్తుంటే బాబోయ్ అనుకోకుండా ఉండ‌లేరు. ఇప్ప‌టికే 85 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం.

GEETHA GOVINDAM

ఇక ఇప్పుడు ఓవ‌ర్సీస్ లో 2 మిలియ‌న్ కూడా వ‌సూలు చేసి రికార్డులు తిర‌గ‌రాస్తుంది. ఈ వారం ఆది నీవెవ‌రోతో పాటు ర‌ష్మి అంత‌కుమించి.. నారా రోహిత్ ఆట‌గాళ్ళు.. ప్ర‌భుదేవా ల‌క్ష్మి వ‌చ్చినా కూడా ఒక్క‌టి కూడా క‌నీసం గీత‌గోవిందం ముందు నిల‌బ‌డ‌లేక‌పోయాయి. అస‌లు అవి వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మంది ప్రేక్ష‌కుల‌కు తెలియ‌డం లేదు. అంత‌గా గీత‌గోవిందం హవా సాగుతుంది.

ఈ సినిమా దూకుడు చూస్తుంటే అస‌లు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుంద‌నేది కూడా అర్థం కావ‌డం లేదు. విజ‌య్ స‌త్తా ఈ రేంజ్ లో ఉందా అని అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు విజ‌య్ త‌న సినిమా స‌క్సెస్ రేంజ్ చూసి ఇంకేం ఇంకేం కావాలే.. చాలే ఇది చాల్లే అంటూ త‌న సినిమా పాటే తానే పాడుకుంటున్నాడు. అంత‌గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఓవ‌ర్సీస్ లో 2 మిలియ‌న్ దాటేసి.. ఇప్పుడు 2.3 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తుంది ఈ చిత్రం. అంతా చేస్తే ఈ సినిమాను అమ్మింది 15 కోట్ల‌కే. ఇప్ప‌టికే 50 కోట్ల షేర్ వ‌సూలు చేసిన ఈ చిత్రం 60 కోట్ల‌కు పైగానే ఫుల్ ర‌న్ షేర్ తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here