సోన‌మ్.. నీ అందానికి అంతా దాసోహం..

SONAM KAPOOR HOT LATEST TRENDS
స్టైల్.. యూత్ ఐకాన్.. ఇలాంటి ప‌దాలకు నిలువైన నిద‌ర్శ‌నం సోన‌మ్ క‌పూర్. ఉత్త‌రాదిన ఎంత‌మంది ముద్దుగుమ్మలైనా ఉండొచ్చు కానీ క‌చ్చితంగా వాళ్లలో సోన‌మ్ క‌పూర్ మాత్రం వేరు. ఈమె స్టైల్ కు ఐకాన్ కాదు.. కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంది. సినిమాల‌తో కాకుండా కేవ‌లం ట్రెండ్స్ తో లైమ్ లైట్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మిగిలిన హీరోయిన్ల‌తో పోలిస్తే ఈ భామ న‌టించింది త‌క్కువ సినిమాలే.. హిట్లు కూడా త‌క్కువే. కానీ క్రేజ్ ప‌రంగా చూస్తే మాత్రం సోన‌మ్ కు చెప్పుకోలేనంత ఉంది. దానికి కార‌ణం ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో అయ్యే ట్రెండే. ఉత్త‌రాదిన మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా ఎవ‌రైనా చెప్పే స‌మాధానం సోన‌మ్ క‌పూర్ అని. హాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్త‌ర‌పోయే స్టైల్ ఫాలో అవుతుంటుంది ఈ భామ‌. బాలీవుడ్ లో ఈమె కంటే స్టైల్ గా మేకోవ‌ర్ అయిన వాళ్లు గానీ.. ఈమె కంటే ఫ్యాష‌న్ లో ముందుండే వాళ్లు గానీ మ‌రెవ‌రూ లేరు.
హ‌ద్దులు దాటడం అంటే ఈ భామ‌కు మ‌రీ స‌ర‌దా. దాటిన ప్ర‌తీసారి మ‌రీ ఇంత‌గా దాట‌డ‌మ‌ని ఎవ‌రికీ తెలియ‌దు కాబోలు.. అందుకే సోన‌మ్ సోకులు చూసి ప్ర‌తీసారి షాక్ అవుతుంటారంతా. ఇప్పుడు కూడా ఈమె ఇదే చేసింది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు వ‌చ్చిన ఈ భామ త‌న క్లీవేజ్ షోతో అంద‌రి మ‌తులు చెడ‌గొట్టేసింది. ఈ ఫోటోషూట్ చూసి అంతా షాకైపోతున్నారు. అన్నీ కెమెరాల ముందు త‌న ఎద అందాలను పూర్తిగా ప‌రిచేసింది సోన‌మ్ క‌పూర్. అస‌లే చ‌లి పుట్టిస్తుంటే.. ఇప్పుడు త‌న అందాల‌తో మ‌రింతగా గిలి రేపుతుంది ఈ బ్యూటీ. దాన్ని ఫ్యాష‌న్ అనుకోవాలో.. లేదంటే తెగింపు అనుకోవాలో తెలియ‌క త‌లలు ప‌ట్టుకుంటున్నారు విమ‌ర్శ‌కులు. ఏకంగా క్లీవేజ్ షో అంటే మ‌రీ ఇంత‌లా చేయాలా అంటూ ముక్కున వేలేసుకునేలా రెచ్చిపోయింది సోన‌మ్ క‌పూర్. ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత సోన‌మ్ గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవు.. జ‌స్ట్ ఓ మాట చెప్పి హాలీవుడ్ కు సాగ‌నంప‌డ‌మే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here