వెంకీతో త‌మ‌న్నా.. సీనియ‌ర్ అయిపోయిందా..?


ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు త‌మ‌న్నా కేవ‌లం కుర్ర హీరోల‌తోనే రొమాన్స్ చేసింది. ఈమె ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏళ్లైనా కేవ‌లం కుర్ర హీరోలే అవ‌కాశాలిస్తూ వ‌చ్చారు. సీనియ‌ర్ హీరోల‌తో అస‌లు న‌టించలేదు ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు ఇక త‌ప్ప‌డం లేదు. కుర్రాళ్లెవ‌రూ ఛాన్సులివ్వ‌క‌పోవ‌డంతో సీనియ‌ర్ హీరోల వైపు చూస్తుంది త‌మ‌న్నా. ఇప్పుడు ఈమె వెంక‌టేశ్ లాంటి సీనియ‌ర్ హీరోకు జోడీగా న‌టించ‌నుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2లో వెంక‌టేశ్ కు జోడీగా త‌మ‌న్నాను ఫైన‌ల్ చేస్తూ క్యాస్టింగ్ కూడా విడుద‌ల చేసారు.
ఈ చిత్ర పూర్తి పేరు ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్. వెంకీతో పాటు ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ను ఎంజాయ్ చేయ‌బోతున్న‌ది వ‌రుణ్ తేజ్. ఈ మ‌ల్టీస్టార‌ర్ ను దిల్ రాజు నిర్మించ‌నున్నాడు. ఇందులో వ‌రుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ ను తీసుకుంటున్నారు. రాజా ది గ్రేట్ తో క‌లిసొచ్చింది కాబ‌ట్టి ఆమెనే కంటిన్యూ చేస్తున్నాడు అనిల్. ఇక వెంక‌టేశ్ కు జోడీగా ముందు శ్రీ‌యాను అనుకుని ఇప్పుడు త‌మ‌న్నా వైపు అడుగేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. శ్రీ‌య అయితే మ‌రీ రొటీన్ అయిపోతుంద‌ని భావించిన అనిల్ రావిపూడి.. కొత్త‌గా ఉంటుంద‌ని త‌మ‌న్నాను తీసుకున్నాడు.
ఇప్పుడు త‌మ‌న్నాకు పెద్ద‌గా ఆఫ‌ర్లు కూడా లేవు. ఇలాంటి టైమ్ లో వెంక‌టేశ్ తో అవ‌కాశం అంటే చిన్న‌దేం కాదు. పైగా ఇప్పుడు త‌మ‌న్నా కూడా సీనియ‌ర్ హీరోయినే క‌దా..? అందుకే సీనియ‌ర్ హీరోతో జోడీకి రెడీ అవుతుంది. జూన్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ జోడీ స్క్రీన్ పై ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here