ల‌వ‌ర్ రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180720

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: ల‌వ‌ర్
న‌టీన‌టులు: రాజ్ త‌రుణ్, రిద్ధికుమార్, సుబ్బ‌రాజ్, రాజీవ్ క‌న‌కాల‌, అజ‌య్, స‌చిన్ ఖేడ్ క‌ర్..
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి
సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: అనీష్ కృష్ణ‌
నిర్మాత‌: హ‌ర్షిత్ రెడ్డి
రాజ్ త‌రుణ్ సినిమాల‌పై ఇప్పుడు పెద్ద‌గా క్రేజ్ లేదు కానీ దిల్ రాజు చేయి ప‌డ్డందుకే ఈ సినిమాపై ఆస‌క్తి పెరిగింది. మార్కెట్ తో ప‌నిలేకుండా కాస్త భారీగానే ఈ చిత్రాన్ని నిర్మించాడు దిల్ రాజు. మ‌రి ఆయ‌న పెట్టుకున్న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టాడు ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ‌..?
క‌థ‌:
రాజ్(రాజ్ త‌రుణ్) టాప్ బైక్ డిజైన‌ర్. త‌న‌కు కావాల్సిన‌ట్లు బైక్ లు కానీ లైఫ్ ను గానీ మార్చుకునే ర‌కం. రాజ్ అన్న‌య్య జ‌గ్గూభాయ్(రాజీవ్ క‌న‌కాల‌) రౌడీ. జ‌గ్గూభాయ్ పై జ‌రిగిన అటాక్ లో తాను గాయ‌ప‌డ‌తాడు రాజ్. హాస్పిట‌ల్ లో న‌ర్స్ చ‌రిత‌(రిద్ధ‌కుమార్) ను చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌ట్నుంచీ ఆమె ప్రేమ కోస‌మే తిరుగుతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోకుండా చ‌రిత ఓ స్కామ్ లో ఇరుక్కుని ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటుంది. అప్పుడు రాజ్ ఆమె కోసం ఏం చేసాడు అనేది క‌థ‌..
క‌థ‌నం:
అదృష్టం లేక‌పోతే అర‌టిపండు తిన్నా ప‌న్నురిగిద్ది అంటారు క‌దా.. పాపం రాజ్ త‌రుణ్ కు అయితే ఏకంగా ప‌న్ను జారి చేతుల్లోకి వ‌చ్చింది. దిల్ రాజైనా జాత‌కం మార్చేస్తాడేమో అనుకుంటే.. ఏకంగా ఆయ‌న వ‌ర‌స విజ‌యాలకే బ్రేక్ వేసేలా ఉన్నాడు రాజ్ త‌రుణ్. అంద‌రి విష‌యంలో ప‌నికొచ్చిన మిడాస్ ట‌చ్ రాజ్ త‌రుణ్ కు రివ‌ర్స్ అయింది. తెలిసిన క‌థ‌నే.. మ‌రింత తేలిగ్గా తెర‌కెక్కించాడేమో అనిపించింది ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ‌. అలా ఎలాలో సూప‌ర్ కామెడీ వ‌ర్క‌వుట్ చేసిన ఈ ద‌ర్శ‌కుడు.. ఈ సారి మాత్రం ఆ మ్యాజిక్ చేయ‌డంలో విఫ‌లం అయ్యాడు. చాలాసార్లు చూసిన మెడిక‌ల్ మాఫియానే మ‌ళ్లీ క‌థ‌గా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. రొటీన్ క‌థ తీసుకున్నా.. చాలా మంది ద‌ర్శ‌కులు ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తుంటారు.. కానీ ఈ విష‌యంలో ఎందుకో అనీష్ స‌క్సెస్ కాలేదేమో అనిపిచింది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు క‌థేమీ లేకుండా హీరో హీరోయిన్ ప్రేమ‌తో సోసోగా న‌డిపించిన ద‌ర్శ‌కుడు.. సెకండాఫ్ లో అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు.. అయితే సీన్స్ అన్నీ ఊహించేలా ఉండ‌టం ల‌వ‌ర్ కు మైన‌స్.. స‌చిన్ ఖేడ్ క‌ర్ లాంటి న‌టున్ని కుర్చీకే ప‌రిమితం చేయ‌డం ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది. రాజ్ త‌రుణ్ మార్కెట్ ను ప‌ట్టించుకోకుండా దిల్ రాజు భారీగా ఖ‌ర్చు పెట్ట‌డం విశేషం.
న‌టీన‌టులు:
రాజ్ త‌రుణ్ ఎప్ప‌ట్లాగే న‌టించాడు. ఎన‌ర్జిటిక్ గా అనిపించానా.. ఎందుకో ఈయ‌న భాష మాత్రం అర్థం కాదు. ఈసారి సీమ యాస‌లో మాట్లాడేస‌రికి అది ఇంకాస్త క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసింది. రిద్ధికుమార్ చూడ్డానికి బాగుంది.. న‌ట‌న కూడా ప‌ర్లేదు. రాజీవ్ క‌న‌కాల హీరో త‌ర్వాత హీరో కారెక్ట‌ర్ చేసాడు. సుబ్బ‌రాజ్.. అజ‌య్.. స‌చిన్ ఖేడ్ క‌ర్ లాంటి వాళ్ల‌ను వేస్ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. చిన్న పాత్ర‌ల‌కే ప‌రిమితం చేసాడు.
టెక్నిక‌ల్ టీం:
స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. ఐదుగురు సంగీత ద‌ర్శ‌కుల క‌ష్టం ల‌వ‌ర్ లో క‌నిపించింది. ఐదుగురు సంగీత ద‌ర్శ‌కులు ఈ సినిమాకు ప‌ని చేసారు. పాట‌లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నాలో చిలిపిక‌ల సాంగ్ అయితే చాలా బాగుంది. కేర‌ళ అందాల‌ను బాగా చూపించాడు డిఓపి. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా అనీష్ కృష్ణ రెండో సినిమాతో ఆక‌ట్టుకోలేక‌పోయాడు. పాత క‌థ తీసుకోవ‌డం ల‌వ‌ర్ కు మైన‌స్ గా మారింది. అయితే అక్క‌డ‌క్క‌డా ఆక‌ట్టు కునే స‌న్నివేశాలు ఉన్నా అది సినిమాను మాత్రం నిల‌బెట్ట‌డం క‌ష్టం.
చివ‌ర‌గా:
ల‌వ‌ర్.. ఈ సారి కాస్త క‌ష్ట‌మే బాసూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here