రివ్యూ: చిన‌బాబు

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180713

Critic Reviews for The Boxtrolls

రివ్యూ         : చిన‌బాబు
న‌టీన‌టులు   : కార్తి, స‌యేషా సైగ‌ల్, స‌త్య‌రాజ్, భానుప్రియ, శ‌త్రు త‌దిత‌రులు
నిర్మాత‌       : సూర్య
సంగీతం      : డి ఇమాన్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పాండిరాజ్
వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న కార్తి ఇప్పుడు చిన‌బాబు సినిమాతో వ‌చ్చాడు. గ‌తేడాది ఖాకీతో తెలుగులోనూ విజ‌యం సాధించాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రోసారి వ‌చ్చాడు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు అల‌రించాడు..? ఈ చిన‌బాబు నిజంగానే మ‌నోళ్ల‌ను కూడా మెప్పించాడా..?
క‌థ‌:
కృష్ణంరాజు అలియాస్ చిన‌బాబు(కార్తి) రుద్ర‌రాజు (స‌త్య‌రాజ్)కు ఒక్క‌గానొక్క సంతానం. ఐదుగురు ఆడ‌పిల్ల‌ల త‌ర్వాత పుట్టిన వార‌సుడు కావ‌డంతో ప్రాణంలా చూసుకుంటాడు. చిన్న క‌ష్టం కూడా రాకుండా పెంచుకుంటాడు. చిన‌బాబు కూడా అక్క‌లంటే ప్రాణం ఇస్తుంటాడు. అదే క్ర‌మంలో అక్క కూతుళ్లలో ఎవ‌రో ఒక‌ర్ని చిన‌బాబుకు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటారు.
అదే స‌మ‌యంలో చిన‌బాబు మాత్రం నీల‌నీర‌ద‌ (స‌యేషా సైగ‌ల్) ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌ట్నుంచీ ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. వాటిని పెంచే ప‌నిలో ఉంటాడు చిన‌బాబు శ‌త్రువు సురేంద్ర రాజు(శ‌త్రు)తో చిన‌బాబుకు గొడ‌వ అవుతుంది. అప్ప‌ట్నుంచి చిన‌బాబు ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది.. ఆ కుటుంబం మ‌ళ్లీ ఎలా క‌లిసింది అనేది క‌థ‌..
క‌థ‌నం:
ఐదుగురు అక్క‌లు.. ఒక్క‌డే త‌మ్ముడు.. ఉమ్మ‌డి కుటుంబం.. క‌లిసుంటే క‌ల‌దు సుఖం.. కానీ క‌లిసున్న‌పుడే క‌ల‌హాలు కూడా ఉంటాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఇదే చిన‌బాబు. ఫ్యామిలీ రిలేష‌న్స్ పై న‌డిచే ప్యూర్ ఎమోష‌న‌ల్ డ్రామా చిన‌బాబు. కాక‌పోతే కాస్త త‌మిళ తాళింపు ఎక్కువైందంతే. ఆ డోస్ త‌ట్టుకోగ‌లిగితే చిన‌బాబు మ‌న‌సుకు చేరువ‌వుతాడు. ఒకే ఇంట్లో ఐదుగురు ఆడ‌పిల్ల‌లుంటే వాళ్ల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి.
తోడ‌బుట్టిన వాళ్లైనా.. ఒక‌రిపై ఒక‌రికి అసూయ‌.. ప్రేమ‌.. కోపం.. ఇలా అన్ని చూపించాడు ద‌ర్శ‌కుడు పాండిరాజ్. ఈ రిలేష‌న్స్ కు భాష‌తో ప‌నిలేదు. ఇంట్లో ఆడ‌పిల్ల‌లు ఎక్కువ‌గా ఉన్న‌వాళ్ళంద‌రికీ చిన‌బాబు ఇంకా బాగా క‌నెక్ట్ అవుతాడు. ఓవైపు అవ‌కాశం దొరికిన ప్ర‌తీసారి రైతుల గొప్ప‌త‌నం గురించి చెబుతూనే మ‌రోవైపు ప్ర‌భుత్వ ప‌నితీరుపై కూడా సెటైర్లు పేల్చాడు ద‌ర్శ‌కుడు పాండిరాజ్. ఇంకోవైపు త‌న క‌థ‌కు మూలంగా ఉన్న ఉమ్మ‌డి కుటుంబ బ‌లం చూపించాడు. ఎమోష‌న్స్ ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయో.. కామెడీ కూడా అంతే న‌వ్విస్తుంది.
సెంటిమెంట్ కాస్త హెవీడోస్ అయ్యే టైమ్ లో సూరి కామెడీతో క‌వ‌ర్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ లో హీరో ల‌వ్.. కామెడీ.. కుటుంబాన్ని చూపించిన పాండిరాజ్.. సెకండాఫ్ లో క‌థ‌ను ఎమోష‌న‌ల్ మ‌లుపులు తిప్పాడు. రొటీన్ క‌థే అయినా.. కుటుంబ బంధాల‌తో దారాన్ని బ‌లంగా ముడేసాడు ద‌ర్శ‌కుడు. కార్తి ఆద‌ర్శ రైతుగా.. గొప్ప త‌మ్ముడిగా.. మంచి మావ‌య్య‌గా.. అల్ల‌రి ప్రేమికుడిగా.. కొడుకుగా.. ఒకే సినిమాలో చాలా షేడ్స్ ఉన్న పాత్ర‌లో మెప్పించాడు. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో వ‌చ్చిన ఊర‌మాస్ త‌మిళ డ‌బ్బింగ్ సినిమా చిన‌బాబు.
న‌టీన‌టులు:
కార్తి చిన‌బాబుగా అల‌రించాడు. త‌మ్ముడిగా.. కొడుకుగా.. మామ‌య్యగా.. రైతుగా ఇలా అన్ని పాత్ర‌ల్లో మెప్పించాడు. ఒకే సినిమాలో ఇన్ని షేడ్స్ ఉన్న పాత్ర చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఎమోష‌న‌ల్ సీన్స్ లో చాలా బాగా న‌టించాడు కార్తి. హీరోయిన్ స‌యేషా సైగ‌ల్ పాట‌ల‌కు ప్రేమ స‌న్నివేశాల‌కు మాత్ర‌మే స‌రిపోయింది.
స‌త్య‌రాజ్ కూడా అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే పాత్రే. హీరో ఫ్రెండ్ గా సూరి కామెడీతో న‌వ్వించాడు. భానుప్రియ‌తో పాటు మిగిలిన వాళ్ళంతా ఆయా స‌మ‌యానికి క‌నిపించే పాత్ర‌లే. విల‌న్ గా శ‌త్రుకు మంచి పాత్ర ప‌డింది. ఈ కారెక్ట‌ర్ తో త‌మిళ్ తో సెట్ అయ్యేలా క‌నిపిస్తున్నాడు.
టెక్నిక‌ల్ టీం:
డి ఇమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప‌క్కా త‌మిళ సినిమాకు ఇచ్చే సంగీత‌మే ఇచ్చాడు ఈయ‌న‌. ఎడిటింగ్ బాగుంది. రెండున్న‌ర గంట‌ల సినిమా అయినా కూడా పెద్ద‌గా బోర్ కొట్ట‌దు. కాక‌పోతే అక్క‌డ‌క్క‌డా త‌మిళ డోస్ మ‌రీ ఎక్కువైన ఫీలింగ్ వ‌స్తుంది. నిర్మాత‌గా సూర్య టాప్ లెవల్లో ఉన్నాడు.
ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ భారీగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు పాండిరాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి.. పాత క‌థ‌నే మ‌రింత అందంగా చెప్పాడు ఈయ‌న‌. ఇలాంటి క‌థ‌తో రెండున్న‌ర గంట‌లు కూర్చోబెట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ అది చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.
చివ‌ర‌గా:
చిన‌బాబు.. క‌లిసుంటే క‌ల‌దు సుఖం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here