రివ్యూ: గూఢ‌చారి

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180803

Critic Reviews for The Boxtrolls

రివ్యూ          : గూఢ‌చారి
న‌టీన‌టులు   : అడ‌విశేష్, శోభితా ధూళిపాల‌, మ‌ధుశాలిని, ప్ర‌కాశ్ రాజ్, వెన్నెల కిషోర్, జ‌గ‌ప‌తిబాబు, సుప్రియ‌..
క‌థ, స్క్రీన్ ప్లే : అడ‌వి శేష్
ద‌ర్శ‌కుడు     : శ‌శికిర‌ణ్ టిక్కా

క్ష‌ణంతో తాను కూడా ఇండ‌స్ట్రీలోనే ఉన్నానంటూ గుర్తు చేసాడు అడ‌విశేష్. అంత‌కుముందు చిన్న పాత్ర‌లతో మెరిసిన ఈ న‌టుడు.. క్ష‌ణంతో ఒక్క‌సారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండేళ్ళ త‌ర్వాత గూఢ‌చారి అంటూ వ‌చ్చాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? ఇది కూడా క్ష‌ణం మాదిరే ఆక‌ట్టుకుందా..?

క‌థ‌:

అర్జున్ అలియాస్ గోపీ(అడ‌విశేష్)కి దేశం అంటే ప్రాణం. అది వాళ్ల నాన్న ర‌ఘువీర్ నుంచి వ‌స్తుంది. అత‌డు సిన్సియ‌ర్ ఆర్మీ ఆఫీస‌ర్. గోపీ చిన్న‌పుడే ర‌ఘువీర్ ను టెర్ర‌రిస్ట్ ను చంపేస్తారు. దాంతో గోపీకి ఏం కాకూడ‌ద‌ని ర‌ఘువీర్ స్నేహితుడు స‌త్య‌(ప్ర‌కాశ్ రాజ్) రాజ‌మండ్రి తీసుకొచ్చి పెంచుతాడు. కానీ గోపీకి మాత్రం తండ్రిలా దేశానికి సేవ చేయాల‌ని ఉంటుంది.

దానికోసం అన్ని ప్ర‌యత్నాలు చేసి చివ‌రికి రా ఏజెంట్ గా సెలెక్ట్ అవుతాడు. టెర్ర‌రిస్ట్ ల‌ను ప‌ట్టుకునే బ‌దులు త‌నే టెర్ర‌రిస్ట్ గా ముద్ర వేయించుకుంటాడు. ఆ త‌ర్వాత ఏమైంది..? అస‌లు అర్జున్ జీవితంలోకి స‌మీరా (శోభితా) ఎందుకు వ‌స్తుంది..? టెర్ర‌రిస్ట్ రాణా(జ‌గ‌ప‌తిబాబు) అర్జున్ ను ఎందుకు టార్గెట్ చేస్తాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

ప‌రిగెత్తి పాలు తాగ‌డం కంటే.. నిల‌బ‌డి నీళ్లు తాగ‌డం న‌యం అంటారు క‌దా.. అడ‌వి శేష్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. క్ష‌ణం లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత కూడా.. హ‌రీబ‌రీగా కాకుండా ఆలోచించి రెండేళ్ల త‌ర్వాత మంచి సినిమాతో వ‌చ్చాడు శేష్. త‌న గురించి ఇండ‌స్ట్రీ ప‌ట్టించుకుంటుందా లేదా అని ఆలోచించ‌కుండా.. త‌న గురించి తానే ప‌ట్టించుకుని టైమ్ తీసుకుని క‌థ‌లు రాసుకుంటున్నాడు అడ‌వి శేష్. క్ష‌ణంలోనే అద్భుత‌మైన రైటింగ్ ప్ల‌స్ స్క్రీన్ ప్లేతో ఆక‌ట్టుకున్న శేష్.. ఈ సారి అదే చేసాడు. రెండేళ్లు టైమ్ తీసుకున్నా.. గూఢ‌చారిలో ఆ క‌ష్టం స‌మ‌యం క‌నిపించాయి.

ఎలాగైనా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవాల‌నే క‌సి శేష్ లో క‌నబ‌డుతుంది. రొటీన్ సినిమాలు చేస్తే.. రోజులో మ‌రిచిపోతారు ప్రేక్ష‌కులు.. అందుకే కాస్త ఆలోచించి ఇంటిలిజెంట్ సినిమాల‌తో వ‌స్తున్నాడు. గూఢ‌చారి తెలియ‌ని క‌థ కాదు.. దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే స్పై క‌థ‌.. ఇంత సింపుల్ క‌థ‌ను అద్భుత‌మైన స్క్రీన్ ప్లే తో స్క్రీన్ పై ప్ర‌జెంట్ చేసాడు ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు హీరో స్పై అంటే నేరుగా టీంతో జాయిన్ అయిపోయి.. టెర్ర‌రిస్ట్ ల‌తో చెడుగుడు ఆడుకుంటాడు.. కానీ ఇందులో మాత్రం డిఫెరెంట్.

ఫ‌స్టాఫ్ అంతా ఓ స్పైను ఎలా సిద్ధం చేస్తారో వివ‌రంగా చూపించాడు ద‌ర్శ‌కుడు.. ఇదే కొత్త‌గా అనిపిస్తుంది. అదిరిపోయే ట్విస్టుల‌తో క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ తో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ లో పేస్ త‌గ్గిన‌ట్లు అనిపించినా.. క్లైమాక్స్ కు వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ సినిమా గాడిన ప‌డుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎపిసోడ్స్.. యాక్ష‌న్ సీక్వెన్స్ లు సినిమాకు మేజ‌ర్ హైలైట్. థ్రిల్ల‌ర్ సినిమాల‌ను.. స్పై కాన్సెప్టుల‌ను ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు గూఢ‌చారి పండ‌గే. రొటీన్ సినిమాల‌కు అల‌వాటు ప‌డిన వాళ్ల‌కు.. ఈ చిత్రం రుచించ‌దు. ఓవ‌రాల్ గా గూఢ‌చారి.. ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్ల‌ర్..

న‌టీన‌టులు:

అడ‌విశేష్ మ‌రోసారి త‌న రైటింగ్ తో పాటు న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 20 ఏళ్ల త‌ర్వాత స్క్రీన్ పై క‌నిపించినా.. సుప్రియ చాలా బాగా న‌టించింది.
ప్ర‌కాశ్ రాజ్ బాగా న‌టించాడు.. జ‌గ‌ప‌తిబాబు స‌ర్ ప్రైజ్. శోభితా దూళిపాల బాగుంది. త‌క్కువ స‌మ‌యం క‌నిపించినా ఆక‌ట్టుకుంది. మ‌ధుశాలిని కూడా త‌న వంతు పాత్ర‌లో మెప్పించింది. ఇక వెన్నెల కిషోర్ కాస్త స్పెష‌ల్ ట‌చ్ ఇచ్చాడు.

టెక్నిక‌ల్ టీం:

స్పై థ్రిల్ల‌ర్స్ కు పాట‌ల కంటే కూడా కావాల్సింది సంగీతం. ఆర్ఆర్ బాగుంటే సినిమా రేంజ్ కూడా పెరుగుతుంది. ఈ విష‌యంలో గూఢ‌చారికి బ్యాక్ బోన్ లా నిలిచాడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల. పాట‌ల కంటే కూడా ఆర్ఆర్ అద‌ర‌గొట్టాడు. రెండున్నర గంట‌ల సినిమా అయినా కూడా ఎక్క‌డా పెద్ద‌గా బోర్ అనిపించ‌దు. క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడు ఎడిట‌ర్. క్ష‌ణం త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా కూడా అడ‌విశేష్ క‌ష్టం ఇందులో క‌నిపిస్తుంది. స్క్రీన్ ప్లే రైట‌ర్ గా ఆక‌ట్టుకున్నాడు. ద‌ర్శ‌కుడిగా శ‌శికిర‌ణ్ టిక్కా ప‌నితీరు బాగుంది.

చివ‌ర‌గా:

గూఢచారి.. ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్ల‌ర్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here