రాధాకృష్ణ లీగల్‌ నోటీసుకు పవన్ అభిమాని కౌంటర్

Pawan Kalyan
తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ట్విటర్‌లో అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా పవన్‌కు లీగల్‌ నోటీసు పంపించారు.
తనపైనా, తన సంస్థపైనా చేసిన ఆరోపణలను, ట్వీట్లను బేషరతుగా ఉపసంహరించుకుని ట్విటర్‌ నుంచి తొలగించి లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నోటీసు పంపారు. లేనిపక్షంలో తాను సివిల్‌, క్రిమినల్‌ పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు.
రాధాకృష్ణ కు అసలు పరువు ఉందా…పరువు నష్టం దావా వేయడానికి అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. స్పెషల్ స్టేటస్, ఆక్వా ఫుడ్ బాధితుల, ఉద్దానం బాధితుల సమస్యల పై ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీయడం గానీ, డిబేట్లు పెట్టడం గానీ చేయని ఏ.బి.ఎన్ శ్రీ రెడ్డి విషయంలో, కత్తి మహేష్ విషయంలో అతి ఉత్సాహంతో డిబేట్లు చర్చ కార్యక్రమాలు పెట్టడం టి.ఆర్.పి ల కోసం కాదా.
AndhraJyothy RK sends legal notice to PawanKalyan
వీకెండ్ విత్ ఆర్ కె అని ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయినా వై ఎస్ జగన్ ను , జన సేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించే రాధాకృష్ణ,
అవినీతి లో కూరుకుపోయిన తెదేపా ప్రభుత్వాన్ని గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గానీ ఏనాడూ ప్రశ్నించకపోవడం ఏమిటి. పక్షపాతంలేకుండా విశ్లేషిస్తున్నాం అని చెప్పుకొనే రాధాకృష్ణకు ఇది తగునా. దన దాహం తో కుల రాజకీయాలు చేసే పార్టీలకు కొమ్ముకాయడం ఎంత వరకు సామన్యసం. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా గత ఆరు నెలలు గా చేస్తున్న నెగటివ్ ప్రోపగాండాకు మీకు అందుతున్న ముడుపుల మాటేమిటి.
ఇప్పుడు శ్రీ రెడ్డి వ్యవహారంలో ఆమె కాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న పోరాటం కంటే మీకు ఆమె అర్ధనగ్న ప్రదర్శన, పవన్ కళ్యాణ్ పై చేసిన అభ్యంతరకర దూషణ పైనే ఆసక్తి గా డిబేట్లు, ప్రోగ్రాములు చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి. ఆమె నిందించిన అభిరాం, కోన వెంకట్, కొరటాల శివ వంటి వారి తో డిబేట్లు పెట్టడం మానేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్న కత్తి మహేష్, శ్రీ రెడ్డి వంటి వారితోనే చర్చలు పెట్టడం వాళ్ళ మీకు వచ్చే లాభాలు ఎంత.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాగ్ రిపోర్ట్ లో 2000 కోట్లు దుబారా అవుతున్నాయి అని వస్తే దాని మీద మీ ఛానెల్లో ఏమి మాట్లాడలేధు. వీణ వాణి కేసులో మీరు ఫండ్స్ దుర్వినియోగం చేసారని మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీ వీకెండ్ కామెంట్ లో ఎందుకు స్పందించలేదు. మొన్నటికి మొన్న బాలకృష్ణ ప్రధానమంత్రిని బూతులు తిడితే మాటవరుసకైనా మీ ఛానల్ లో ఆ న్యూస్ చూపించలేదు.
పవన్ కళ్యాణ్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆయన ఇమేజ్ ను ఎల్లా దెబ్బతీయాల, ఆయనకు వస్తున్నా ప్రజాదరణను ఎలా తగ్గించాలి, 2019 ఎలక్షన్ ల లో జన సేన ప్రభావం ఎలా తగ్గించాలి అనే ఒకే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఉన్నాది ఏ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్. గత ఆరు నెలలుగా మీరు పవన్ పై చేస్తున్న దుష్ప్రచారం వీడియో లన్ని జన సేన పార్టీ భాగమైన శతాగ్ని సోషల్ మీడియా టీం పరిశీలించి జత సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. బలమైన సాక్ష్యాలతో మీ పైన లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంది తస్మాత్ జాగర్త.
– రవి బయ్యవరపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here