రాజ‌శేఖ‌ర్ విల‌న్ అవుతున్నాడా..?


ఒక‌ప్పుడు ఎంత స్టార్ డ‌మ్ ఉన్నా.. చాలా మంది సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ ఖాళీ అయిపోయారు. ఏజ్ తో రాజీ ప‌డి విల‌న్లుగా సెటిల్ అయిపోతున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌ప‌తిబాబు.. సుమన్.. వినోద్ కుమార్ తో పాటు ఈ మ‌ధ్యే యుద్ధం శ‌ర‌ణంలో శ్రీ‌కాంత్ కూడా విల‌న్ గా న‌టించాడు. ఇప్పుడు రాజశేఖ‌ర్ కూడా ఇదే చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌నంటూ ఓ హీరో ఉన్నాడ‌ని గ‌రుడ‌వేగ గుర్తు చేసింది. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు కానీ ప్ర‌శంస‌ల‌తో పాటు రాజ‌శేఖ‌ర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇకిప్పుడు ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో.
నెక్ట్స్ సినిమాల‌పై కీల‌క‌మైన విష‌యాలు చెప్పాడు రాజ‌శేఖ‌ర్. ఎక్క‌డ మొద‌లుపెట్టావో అక్క‌డికి వ‌చ్చి ఆగుతున్నాడు ఈ హీరో. కొన్నేళ్లుగా స‌రైన ఫామ్ లేక ఇబ్బంది ప‌డుతున్న ఈ హీరో ఇప్పుడు విల‌న్ గా మార‌నున్నాడు. త‌న‌కి న‌చ్చే క‌థ రావాలే కానీ ఇప్పుడే విల‌న్ గా న‌టిస్తానంటూ ఆఫ‌ర్ ఇచ్చాడు రాజ‌శేఖ‌ర్. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలోనే విల‌న్ గా న‌టించ‌బోతున్నాడు రాజ‌శేఖ‌ర్. రామ్ హీరోగా ప్ర‌వీణ్ ఈ మ‌ధ్యే ఓ సినిమా మొద‌లుపెట్టాడు అదింకా ప‌ట్టాలెక్క‌లేదు.
అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ విల‌న్ గా న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన ప్ర‌వీణ్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈయ‌న కూడా ఒప్పుకున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.
కెరీర్ మొద‌ట్లో త‌లంబ్రాలు లాంటి సినిమాల్లో రాజశేఖ‌ర్ నెగిటివ్ రోల్స్ చేసాడు. ఆ త‌ర్వాత హీరోగా మారాడు. మ‌ళ్లీ ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌పై మోజు ప‌డుతున్నాడు.
ఆ మ‌ధ్య చిరంజీవి 150వ సినిమాలో విల‌న్ గా న‌టిస్తాన‌ని చెప్పిన రాజ‌శేఖ‌ర్.. ఆ త‌ర్వాత ధృవ‌లో న‌టించ‌డానికి ట్రై చేసాడు. కానీ అనుకోని కార‌ణాల‌తో అర‌వింద్ స్వామినే రిపీట్ చేయాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈయ‌న విల‌న్ అవ‌తారం ఎత్త‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ప్ర‌వీణ్ స‌త్తార్ సినిమా కానీ వ‌ర్క‌వుట్ అయితే రాజ‌శేఖ‌ర్ ద‌శ మారిపోయిన‌ట్లే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here