రాజా ది గ్రేట్ రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
2017-10-18

Critic Reviews for The Boxtrolls

తారాగణం: రవి తేజ, మెహ్రీన్ పీర్జాదా, శ్రీనివాస్ రెడ్డి, రాదికా శరత్ కుమార్

దర్శకత్వం: అనిల్ రావిపూడి

సంగీతం: సాయి కార్తీక్

నిర్మాత: దిల్ రాజు

బ్యానర్: శ్రీ వెంకటేశ్వరా సినీ

కథ:

రాజా (రవి తేజ) ఓ అంధుడు, అయితే తల్లి అతనిని ధైర్యశాలిగా యోధుడిగా పెంచుతుంది. ఆమె లాగే కొడుకు కూడా పోలీస్ కావాలని కోరుకుంటుంది. డిపార్ట్మెంట్ లో తన పలుకుబడి ఉపయోగించి రాజా ను ఓ సీక్రెట్ మిషన్ పై నియమించేలా చేస్తుంది. చనిపోయిన పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) కూతురైన హీరోయిన్ మెహ్రీన్ కు విల్లన్ ల నుండి ముప్పు ఉండటంతో, ఆమెను కాపాడే పనిని రాజాకు అప్ప చెప్తారు. తన తెలివి తేటలతో ఆమెను విల్లన్ ల దాడులనుండి కాపాడుతుంటాడు రాజా. అయితే ఒకానొక సందర్భంలో విసిగిపోయి విల్లన్ ల మీద యుద్ధం ప్రకటిస్తాడు. అంధుడైన రాజా విల్లన్ లను తన తెలివి తేటలు సామర్ధ్యాలతో ఎలా ఎదుర్కొంటాడు, హీరోయిన్ ను కాపాడి ఆమె ప్రేమను ఎలా గెలుచుకుంటాడు, పోలీస్ ఉద్యోగం వస్తుందా రాదా అనే విషయాలు తెలుసు కోవాలంటే తెర మీద రాజా ది గ్రేట్ చూడాల్సిందే.

స్క్రీన్ప్లే:

రాజా ది గ్రేట్ రవి తేజ మార్క్ ఫక్తు మాస్ మసాలా చిత్రం. హీరో అంధుడు అనే ఒక్క కొత్త కోణం తప్పితే చిత్రం ఆధ్యంతం కమర్షియల్ పంధాలోనే సాగుతుంది. అనిల్ రావిపూడి ఇదివరకటి చిత్రాలైన పటాస్, సుప్రీమ్ లాగానే ఈ చిత్రాన్ని వినోదాత్మకం గా తెరకెక్కించారు. ప్రథమార్ధం కామెడీ తో సరదాగా సాగిపోతుంది. రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి ల తో రవి తేజ చేసే కామెడీ అలరిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ఓ థ్రిల్లింగ్ ఫైట్ సీక్వెన్స్ తో కథ ఊపందుకుంటుంది. ద్వితీయార్ధం కొంచం ఎమోషనల్ సెంటిమెంట్ మరియు యాక్షన్ ఎక్కువైనా అనిల్ రవి పూడి తన మార్క్ కామెడీ ఎపిసోడ్స్ తో బాలన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా జాగర్త పడ్డాడని చెప్పాలి. లోజిక్కులు పక్కన పెట్టి చూస్తే చిత్రం ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది.

తారాబలం:

రవి తేజ తన హైపర్ ఎనర్జీ తో ఉర్రూతలూగిస్తాడు. ఓ పక్క అంధుడి గా తన హావభావాలతో మెప్పిస్తూనే మరో వైపు తన మార్కు మాస్ ఎనర్జీ మరియు వ్యంగ్య కామెడీ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యాన్స్ చేత ఈలలు వేయిస్తాడు. ముఖ్యంగా డాన్సు లు ఫైట్లు ఇరగదీసాడనే చెప్పాలి. హీరో చేసే ఆశ్చర్య కరమైన స్టంట్ లను నమ్మశక్యం చేసాడు రవి తేజ తన నటనతో. మెహ్రీన్ చాల అందంగా ఉంది కానీ పాటలలో కొంచం బొద్దుగా కనపడింది. పెర్ఫార్మన్స్ కి అవకాశమున్న పాత్రా లో తనవంతు మెప్పించింది. శ్రీనివాస్ రెడ్డి హీరో పక్కనే ఉంది నవ్వులు పూయిస్తాడు. తల్లి గా రాదిక గుర్తుంది పోయే పాత్ర చేసింది. రాజేంద్ర ప్రసాద్, అలీ, పోసాని, సత్యం రాజేష్ మరియు ఇతర కమెడియన్ లు తమ వంతు కితకితలు పెడతారు.

సాంకేతికత:

బ్యాక్ గ్రౌండ్ సంగీతం గురించి ప్రధానం గా చెప్పుకోవాలి. సాయి కార్తీక్ బి.జి.ఎం చిత్రంలోని మాస్ సన్నివేశాలను మరింత రక్తి కట్టించేలా చేసాడు. అనిల్ రవిపూడి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాడుకోవడంలో దిట్ట అని పటాస్ లో భగవద్ గీత ను వాడుకున్నపుడే తెలిసింది. ఇందులోనూ అలాగే గున్న గున్న మామిడి వంటి తెలంగాణ జన పద పాటతో హాస్యం పండించాడు. ఛాయాగ్రహం కూడా చక్కగా ఉంది ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో మరియు పాటలు అందంగా చిత్రీకరించడం లో.

చివరి-మాట: రాజా ది గ్రేట్ రవి తేజ మార్కు ఎంటర్టైనింగ్ మాస్ చిత్రం