యప్ టీవీ నుండి వస్తున్న “మన ముగ్గురి లవ్ స్టోరీ” నవంబర్ 8 నుంచి యాప్ మరియు యూట్యూబ్ లో ప్రసారం ప్రారంభం

ప్రముఖ ఆన్లైన్ సంస్థ “యప్ టీవీ” నిర్మిస్తున్న తాజా వెబ్ సిరీస్ “మన ముగ్గురి లవ్ స్టోరీ”. నవదీప్, ఆదిత్, తేజస్వి మడివాడ, ఆర్జే హేమంత్, మౌనిమ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కు నందిని రెడ్డి స్క్రిప్ట్ రాయగా శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. యప్ టీవీ నిర్మాణంలో ఎర్లీ మాన్సూన్ టేల్స్ బ్యానర్ పై స్వప్నాదత్ నిర్మిస్తున్నారు. రేపట్నుంచి (నవంబర్ 8) యప్ టీవీ యాప్ లో ప్రసారంకానున్న ఈ వెబ్ సిరీస్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఇవాళ హైద్రాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో “యప్ టీవి” యజమాని ఉదయ్, ఎర్లీ మాన్సూస్ టేల్స్ సంస్థ అధినేత స్వప్నాదత్, యప్ టీవి కంటెంట్ హెడ్ విజయ్, దర్శకురాలు నందిని రెడ్డి, మాటల రచయిత లక్ష్మీభూపాల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, నటుడు ఆదిత్, ఆర్జే హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
mana mugguri love story webseries on yupp tv and youtube
ఈ సందర్భంగా యప్ టీవీ అధినేత ఉదయ్ మాట్లాడుతూ.. “డిజిటల్ టెక్నాలజీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రంగంలోకి వచ్చాను. “మన ముగ్గురి లవ్ స్టోరీ”వి రెండు ఎపిసోడ్స్ చూశాను.. చాలా హిలేరియస్ గా వచ్చాయి. 25 మందితో ఒక కంటెంట్ క్రియేషన్ టీం ను ఏర్పాటు చేశాం. సరికొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి యప్ టీవి ఎప్పుడు ముందు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ను మేం ఎంజాయ్ చేసినట్లుగానే ఆడియన్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.
కంటెంట్ హెడ్ విజయ్ మాట్లాడుతూ.. “యప్ టీవీ”తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డిజిటల్ కంటెంట్ ను క్రియేట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాం” అన్నారు.
స్వప్నాదత్ మాట్లాడుతూ.. “మొదట్లో డిజిటల్ కంటెంట్ అంటే తక్కువగా చూసేవాళ్లం కానీ.. సినిమా భవిష్యత్ ఆన్లైన్ లోనే ఉంది. సరికొత్త కాన్సెప్ట్స్ మరియు టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఈ ఆన్లైన్ సోర్స్ పనికొస్తుంది. ఉదయ్ ని చూసి నేనెప్పుడూ ఇన్స్పైర్ అవుతుంటాను. “మన ముగ్గురి లవ్ స్టోరీ” చాలా సింపుల్ లవ్ స్టోరీ.. ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.
నందిని రెడ్డి మాట్లాడుతూ.. “షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నేను నెట్ ఫ్లిక్స్ లో చాలా ఎక్కువగా చూస్తుంటాను. కానీ.. నేను ట్రై చేయడానికి మాత్రం భయపడేదాన్ని ఎక్కడ చిన్నచూపు చూస్తారో అని. కానీ.. స్వప్నాదత్ అడగడంతో కాదనలేకపోయాను, ఆమె ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ రంగంలోకి దిగాను. ఒక అమాయకమైన ఆడపిల్ల పాయింటాఫ్ వ్యూలో సాగే సింపుల్ లవ్ స్టోరీ ఇది. లక్ష్మీభూపాల్ సంభాషణలు మా వెబ్ సిరీస్ కి మెయిన్ హైలైట్” అన్నారు.
రచయిత లక్ష్మీభూపాల్ మాట్లాడుతూ.. “టీవి, న్యూస్ పేపర్, సినిమా, రేడియో వంటి అన్నీ మాధ్యమాల్లోనూ పనిచేసిన నేను వర్క్ చేయకుండా వదిలేసిన ఏకైక జోనర్ “వెబ్ సిరీస్”. అది మాత్రం ఎందుకు వదిలేయాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నందినిరెడ్డి ఈ అవకాశం ఇచ్చింది. చాలా డీసెంట్ గా వచ్చింది ఔట్ పుట్. ఇకపై మరిన్ని వెబ్ సిరీస్ లకు వర్క్ చేయాలనుంది” అన్నారు.
వెబ్ సిరీస్ డైరెక్టర్ శశాంక్ ఏలేటి మాట్లాడుతూ.. “నాకీ సదవకాశమిచ్చిన ఉదయ్ గారికి, స్వప్నాదత్ గారికి కృతజ్నతలు” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు “మన ముగ్గురి లవ్ స్టోరీ”లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని, వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.