మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్  మోహ‌న్‌లాల్ లాంచ్ చేసిన  `యుద్ధ‌భూమి` ట్రైల‌ర్‌!!

 ఇండో-పాక్ బోర్డ‌ర్‌లో 1971లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మ‌ల‌యాళంలో రూపొందిన చిత్రం `1971 బియాండ్ బోర్డ‌ర్స్`. మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్, టాలీవుడ్ మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్  హీరోలుగా న‌టించిన ఈ చిత్రానికి మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌కుడు. గ‌తేడాది మ‌ల‌యాళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్,  శ్రీ ల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై  ఎయ‌న్ బాలాజీ తెలుగులోకి `యుద్ధ‌భూమి పేరుతో అనువ‌దిస్తున్నారు.  అనువాద కార్య‌క్ర‌మాలు ఫైన‌ల్ ద‌శ‌లో ఉన్న‌ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ను   కేర‌ళ‌లో మోహ‌న్ లాల్  చేతుల‌మీదుగా విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ లాల్ మాట్లాడుతూ…“మేజ‌ర్ ర‌వి అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు. ఆర్మీలో త‌ను చాలా కాలం ప‌నిచేయ‌డంతో ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఇప్ప‌టికి ప‌ది  సినిమాలు తీసారు. అందులో ఐదు సినిమాలు నాతోనే చేశారు.  త‌న‌కు దేశ‌భ‌క్తి ఎక్కువ‌. తెలుగులోకి అనువాద‌మవుతోన్న `యుద్ద‌భూమి`కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. నాకు చాలా సంతృప్తినిచ్చిన చిత్రం. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండేలా ఒరిజిన‌ల్ బోర్డ‌ర్ లో చాలా వ‌ర‌కు చిత్రీక‌రించడం జ‌రిగింది. అల్లు శిరీష్ ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ చేశాడు. త‌న‌తో స్ర్కీన్ షేర్  చేసుకోవ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న స‌జెష‌న్స్ తీసుకుంటూ అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. మ‌ల‌యాళంలో విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది. తెలుగులో ఎయ‌న్ బాలాజిగారు `యుద్ద‌భూమి` పేర‌తో విడుద‌ల చేస్తున్నారు.   తెలుగులో `మ‌న్యంపులి` చిత్రాన్ని ఆద‌రించిన‌ట్టుగానే `యుద్ద‌భూమి` చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని“ కోరుకుంటున్నా “ అన్నారు.
ద‌ర్శ‌కుడు మేజ‌ర్ ర‌వి మాట్లాడుతూ…“స్వ‌త‌హాగా నేను సైనికుడుని కావ‌డంతో ఆ నేప‌థ్యంలో సినిమాలు తీయ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను తీసిన  పది  సినిమాలు ఆర్మీ నేప‌థ్యంలో ఉంటాయి. ఇందులో ఐదు సినిమాలు  మోహ‌న్ లాల్ గారితోనే తీసాను. ప్ర‌తి సినిమా ద‌ర్శ‌కుడుగా నాకు మంచి పేరు తెచ్చి పెట్టిందే. నిజంగా ఒక సూప‌ర్ స్టార్ తో ఐదు సినిమాలు తీయ‌డం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. “యుద్ధ‌భూమి`చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చింది. 1971లో ఇండో -పాక్ బోర్డ‌ర్ లో జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. . దేశం కోసం త‌ప్ప ప‌ర్స‌న‌ల్ గా బోర్డ‌ర్ లో ఉండే సైనికుల‌కు ఎలాంటి శ‌తృత్వం ఉండ‌దు. కానీ పై ఆఫీస‌ర్స్ ఆర్డ‌ర్స్ మేర‌కు వాళ్లు న‌డుచుకోవాలి. మ‌న‌లో సైనిక యోధులున్న‌ట్లే వాళ్ల‌లోనూ యోధులుంటారు. మ‌న సైనికుల‌కు దేశ‌భ‌క్తి ఉన్న‌ట్టే వాళ్ల‌కు ఉంటుంది. ఇలా ఇరువైపుల సైనికుల భావోద్వేగాలు, బాధ‌లు , బాధ్య‌త‌లు గురించి ఒక ఎమోష‌నల్ డ్రామాతో ఈ సినిమా తీయ‌డం జ‌రిగింది. ఈ చిత్రంలో మేజ‌ర్‌గా మోహ‌న్ లాల్ ,  యంగ్ డైన‌మిక్ సోల్జ‌ర్ గా అల్లు శిరీష్  న‌టించారు. ఇరువురూ వారివారి పాత్ర‌ల‌కు జ‌స్టిఫై చేశారు. ఈ సినిమా తెలుగులో ఎయ‌న్ బాలాజీ గారు రిలీజ్ చేయ‌డం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. కచ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని“ అన్నారు.
నిర్మాత ఎయ‌న్ బాలాజీ మాట్లాడుతూ…“ ప్ర‌స్తుతం అనువాద  కార్య‌క్ర‌మాలు ఫైన‌ల్ ద‌శ‌లో ఉన్నాయి.  `ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నిజ జీవితంలో కూడా మేజ‌ర్ కావ‌డంతో `యుద్ధ‌భూమి` చిత్రాన్ని  అద్బుతంగా తెర‌కెక్కించారు. త‌న‌లో ఉన్న దేశ‌భ‌క్తికి  మ‌చ్చుతున‌క “యుద్ధ‌భూమి“.  ఇక ఈ చిత్ర క‌థ విష‌యానికొస్తే..1971 లో భారత్ -పాక్ బార్డ‌ర్ లో జ‌రిగే వార్ నేప‌థ్యంలో  రూపొందించిన ఎమోష‌నల్ డ్రామా.   మోహ‌న్ లాల్‌,  అల్లు శిరీష్ యాక్టింగ్ సినిమాకు మెయిన్  హైలెట్.  గ‌తంలో నేను త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించాను.  ఆ అనుభవంతో  `యుద్ధ‌భూమి`  చిత్రాన్ని తెలుగులో  రిలీజ్ చేస్తున్నా.  మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ పడ‌కుండా అనువాద కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం.  మోహ‌న్ లాల్ గారు ఈ సినిమా ప‌ట్ల ఎంతో కేర్ తీసుకుంటున్నారు. వారి చేతుల మీదుగా కేర‌ళ‌లో  మా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది.  త్వ‌ర‌లో  హైద‌రాబాద్ లో గ్రాండ్ గా చేయ‌నున్న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు మోహ‌న్ లాల్ గారు, అల్లు శిరీష్ గారితో పాటు చిత్ర ద‌ర్శ‌కుడుగా కూడా అటెండ్ కానున్నారు“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here